Kalyaan Dhev Instagram Post: కళ్యాణ్‌ దేవ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని కొటేషన్స్ షేర్ చేస్తుంటాడు. అయితే కళ్యాణ్‌ దేవ్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. కళ్యాణ్‌ దేవ్ - శ్రీజ విడాకుల రూమర్లు గత రెండు మూడేళ్లుగా వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నారు. వేరు పడ్డారనే రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు అధికారికంగా ఈ విషయం మీద ఆ ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కళ్యాణ్‌ దేవ్ శ్రీజలు విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారని, ఇద్దరికీ పుట్టిన పాప నవిష్క కోసం అప్పుడప్పుడు కలుస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇంత వరకు శ్రీజ, కళ్యాణ్‌ కలిసి ఉన్న ఫోటో అయితే నెట్టింట్లో కనిపించలేదు. తన పాప నవిష్కను మిస్ అవుతున్నట్టుగా కళ్యాణ్ దేవ్ చెబుతుంటాడు. కళ్యాణ్‌ దేవ్ బర్త్ డే నాడు, నవిష్క బర్త్ డే నాడు బయటకు వచ్చిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.


తన పాపతో తాను ఆడుకుంటూ ఉన్న విజువల్స్‌ను కళ్యాణ్‌ దేవ్ సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో.. ఆ పాపను ఎంతలా మిస్ అయ్యాడో.. నాన్నా మనసు ఇలా ఉంటుందా..? అని జనాలు కామెంట్లు చేశారు. అయితే ఇప్పుడు కళ్యాణ్‌ ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. ఆ కొటేషన్ చూస్తుంటే తన ప్రస్తుత పరిస్థితికి సరిపోయేలా కనిపిస్తోంది.


Also Read: Samantha Shaakuntalam : శాకుంతలం పరిస్థితి ఇంతలా దిగజారిందా?.. ఇదే నిదర్శనం


మనం ఇతరుల పట్ల ఎందుకు అంత దయ, జాలిని చూపించాలంటే.. వారు ఎదుర్కొంటోన్న కష్టాలు, పడుతున్న బాధల గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియనిది కొండంత.. అందుకే ఎదుటి వారి పట్ల మనం జాలిని చూపించాలి అన్నట్టుగా ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. అంటే సెలెబ్రిటీల విషయంలో ఎప్పుడూ ఇలాంటి విమర్శలే వస్తుంటాయని తెలిసిందే. వారి జీవితంలో ఏం జరుగుతోందో తెలియకుండానే.. జనాలు ఇష్టమొచ్చినట్టుగా కామెంట్లు చేస్తుంటారన్న విషయం విదితమే. ఇప్పుడు కళ్యాణ్‌ దేవ్ మాత్రం ఈ కొటేషన్ షేర్ చేయడంతో తన పరిస్థితి గురించి తాను చెప్పుకున్నట్టుగా అనిపిస్తోంది. 


Also Read: Hebba Patel Secret: కుమార్ 24 ఎఫ్ హీరోయిన్ హెబ్బా పటేల్ ఎవ్వరికీ తెలియని సీక్రెట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook