Devil Trailer Launch:బింబిసార 2 ..దేవర గ్లింప్స్ త్వరలోనే.. డెవిల్ ట్రైలర్ లాంచ్ లో కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు
Devil Trailer: వైవిద్యమైన కథలను సినిమాలగా చేయడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందుంటారు. ఈ మధ్యనే బింబిసారా.. ఆమెగోస్ లాంటి డిఫరెంట్ స్టోరీస్ తో మన ముందుకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్లీ డెవిల్ అనే చిత్రంతో రానున్నాడు.. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలై అందరినీ ఆకట్టుకుంటుంది..
Kalyan Ram: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఆయన ఎంచుకునే కథలు ఆయన తీసే సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ మధ్యనే బింబిసారా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత ఆమిగోస్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేసి మెపించారు. కాగా ఇప్పుడు డెవిల్ అనే మరో వైవిధ్యమైన కథతో మన ముందుకి రానున్నారు ఈ హీరో.
పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా రానున్న ‘డెవిల్’ సినిమాకి ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఈరోజు మంగళవారం విడుదలయింది. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ సినిమా యూనిట్ మొత్తం పాల్గొని అందరిని అలరించారు.
ఈ ఈవెంట్ లో ముందుగా రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ ‘‘కళ్యాణ్ రామ్‌గారు నాపై ఉంచని నమ్మకానికి, నాకు ఇచ్చిన సపోర్ట్‌కి చాలా థాంక్స్. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హర్షవర్ధన్ రామేశ్వర్ గారు గ్రేట్ మ్యూజిక్‌ను అందించారు. అందరికీ థాంక్స్’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ ‘‘ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ట్రైలర్‌లో మీరు చూసింది తక్కువే. డిసెంబర్ 29న థియేటర్స్ దీన్ని మించి ఉంటుంది”.. అని ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచేశారు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్.
చిత్ర దర్శక నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘డెవిల్ సినిమా లాంటి కొత్త కాన్సెప్ట్ సినిమా చేయాలంటే, కథను నమ్మి హీరో ముందుకు రావాలంటే గొప్ప విషయం. రెండేళ్ల పాటు కళ్యాణ్ రామ్‌గారు మరో సినిమా ఏదీ చేయకుండా వర్క్ చేశారు. రేపు థియేటర్స్‌లో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. ఈ ఏడాది వీరసింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్‌తో స్టార్ట్ అయ్యింది. డిసెంబర్ 29న డెవిల్ వంటి బ్లాక్ బస్టర్‌తో కంప్లీట్ అవుతుంది. సంయుక్తా మీనన్, మాళవికకు థాంక్స్. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్’’ అని అన్నారు.
ఈ సినిమాలో ముఖ్యపాత్ర చేసిన మాళవికా మోహనన్ మాట్లాడుతూ ‘‘నటీనటులకు కొన్ని సినిమాలు అప్పటి వరకు ఉన్న ఇమేజ్‌ను బ్రేక్ చేస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా దొరుకుతుంటాయి. నాకు డెవిల్ సినిమా రూపంలో అలాంటి సినిమా దొరికింది. సౌందర్ రాజన్‌గారు ఎంటైర్ సినిమాకు పిల్లర్‌లాగా వర్క్ చేశారు. ఆయన సహా టీమ్ సపోర్ట్‌కి థాంక్స్’’ అన్నారు.
ఇక ఈ చిత్ర సంయుక్తా మీనన్ మాట్లాడుతూ ‘‘డెవిల్ మూవీ కోసం ఎంటైర్ టీమ్ రెండేళ్ల పాటు ఎంతో కష్టపడింది. మంచి స్క్రిప్ట్‌తో సినిమా వస్తుంది. ’’ అన్నారు.
చివరిగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘‘మంచి కథ, విజువల్స్, మ్యూజిక్ ఉండి.. దానికి తగ్గ టీమ్ వర్క్ చేసినప్పుడు ఆడియెన్స్ థియేటర్స్‌కి వద్దన్నా వస్తారని నా గత చిత్రం బింబిసార సమయంలో చెప్పాను. ఆ మాటలను మీరందరూ నిజం చేశారు. అదే కోవలో డెఫనెట్‌గా డెవిల్ మంచి కథ, కథనాలతో మీ ముందుకు వస్తుంది. విజువల్స్ ఎలా ఉంటాయనేది ట్రైలర్‌లో చూశారు. కథను తయారు చేసుకున్న శ్రీకాంత్, అద్బుతమైన విజువల్స్ అందించిన సౌందర్ రాజన్‌గారు, అలాగే వెంకట్ మాస్టర్, రామకృష్ణ మాస్టర్, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ గారు, 1940 బ్యాక్ డ్రాప్ లో చేయాల్సిన ఈ చిత్రం కోసం ఓ కొత్త ప్రపంచాన్ని తయారు చేసిన గాంధీగారికి థాంక్స్. వీటన్నింటినీ కలిపి ఇలా చూస్తే బావుంటుందని ఆలోచించి ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను గొప్పగా రూపొందించిన అభిషేక్ నామాగారికి థాంక్స్. ఇలా అందరూ వెనకుండి మా ఆర్టిస్టులందరినీ నడిపించారు. డిసెంబర్ 29న డెవిల్ మీ ముందుకు వస్తుంది. నా మాట తీసుకోండి.. రాసుకోండి.. సినిమా చాలా అంటే చాలా బావుంటుంది. మీకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త కథతో డెవిల్ సినిమా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.
ఇక ఆ తరువాత తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ‘బింబిసార 2ను వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెడతాం. తమ్ముడు ఎన్టీఆర్ సినిమా దేవర గురించి చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. త్వరలోనే గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతున్నాయి. మేం దేవర మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది.. డిసెంబర్ 29న డెవిల్ ను చూసి ఎంజాయ్ చేస్తారు’’అని చెప్పుకొచ్చారు ఈ హీరో.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి