ప్రత్యేక హోదా పోరుపై కళ్యాణ్ రామ్ స్పందన
ప్రత్యేక హోదా పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి పూర్తి స్థాయి మద్ధతు కొరవడిందనే ఆరోపణలపై స్పందించిన కళ్యాణ్ రామ్
ఆంధ్ర ప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించుకోవడం కోసం జరుగుతున్న పోరాటానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి పూర్తి స్థాయి మద్ధతు కొరవడిందనే ఆరోపణలపై హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్ధతు ఇవ్వకూడదనే ఉద్దేశం తెలుగు సినీ పరిశ్రమలో ఏ ఒక్కరికీ లేదని కల్యాణ్ రామ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 'నా నువ్వే' అనే చిత్రం మే నెలలో విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న కళ్యాణ్ రామ్‌ని ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటంపై స్పందించాల్సిందిగా కోరారు కొంతమంది ఫిలిం జర్నలిస్టులు. అలా స్పెషల్ స్టేటస్ అంశంపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. అవకాశం వస్తే పోరాటం చేయడానికి వెనుకడుగు వేయమని అన్నారు.
అవసరమైతే, ప్రత్యేక హోదా సాధన కోసం ఎక్కడి వరకైనా వెళ్తామని ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.