Devara Collections: దేవర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. ఎన్నో సంచనాలను సృష్టించేటట్టు ఉంది.  సెప్టెంబర్ 27న అనగా ఈరోజు విడుదలైన ఈ సినిమా.. ప్రీ బుకింగ్ తోనే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా హవా ఇలానే కొనసాగిస్తే.. మరెన్నో రికార్డులు జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకునేతట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వచ్చిన చిత్రం కావడంతో.. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులకే కాకుండా.. దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ని కూడా విడుదల ముందు వరకు.. చిత్ర యూనిట్ తెగ జోరుగా కొనసాగించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషనల్ ఈవెంట్స్ అటెండ్ అయి మరి అల్లరించారు. ముఖ్యంగా తమిళ ఈవెంట్లో.. జూనియర్ ఎన్టీఆర్ తమిళ్లో మాట్లాడి అక్కడి ప్రేక్షకులను ఫిదా చేశారు. 


ఇక బాలీవుడ్లో…ఈ సినిమా కోసం ఏకంగా ఆలియా భట్, కరణ్ జోహార్ సైతం రంగంలోకి దిగి మరి ప్రమోషన్స్ చేశారు. అంతేకాకుండా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఈ చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూ జరిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇంతమంది పాల్గొన్న ఈ ప్రమోషణాల కార్యాల్లో ఒకరు పాల్గొనక పోవడం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. అది మరెవరో కాదు ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్కి స్వయాన అన్న అయినా..కళ్యాణ్ రామ్  ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కూడా అటెండ్ కాకపోవడం.. అది కూడా ఇంతటి పాన్ ఇండియా చిత్రానికి సైతం ఆయన కనిపించకపోవడం నందమూరి అభిమానుల్లో మరోసారి కొన్ని అనుమానాలను తెచ్చిపెట్టింది. 


అంతకుముందు ఎన్టీఆర్ కెరియర్ మొదట్లో కొన్ని రోజులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య మాటలు లేవు అని వార్తలు వినిపించాయి. కానీ అవన్నీ ఉత్త రూమర్సే అన్నట్టు ఆ తరువాత వీరిద్దరూ ఎంచక్కా కలిసి తిరిగారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ ఏకంగా తన తమ్ముడు ఎన్టీఆర్ సినిమాని నిర్మించారు. అయితే మళ్లీ ఇలా ప్రమోషనల్ ప్రోగ్రామ్స్లో కనిపించకపోవడంతో.. వీరిద్దరి మధ్య మళ్లీ ఏమన్నా జరిగిందా అని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు.


అయితే అసలు విషయానికి వస్తే.. కేవలం కళ్యాణ్ రామ్ తన సినిమా షూటింగులతో బిజీగా ఉండడం వల్ల.. ఎన్టీఆర్ దేవరా ప్రమోషనల్ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయారని తెలుస్తోంది. అందులో ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు కాబట్టి.. ఫ్యూచర్లో ఒకవేళ ఈ సినిమా సక్సెస్ మీట్ కాని జరిపితే.. దానికి తప్పకుండా కళ్యాణ్ రామ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వినికిడి.


Read more: Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక దేవాలయాల్లో కేవలం ఆ నెయ్యి మాత్రమే వాడాలి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.