Kalyanam Kamaneeyam serial launching: జీ తెలుగు అంటేనే అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే సంగతి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గుండెకు హత్తుకునేలా, కళ్ల ముందు కదలాడే పాత్రలను ఆడియెన్స్ ఓన్ చేసుకునేలా సీరియల్స్ తెరకెక్కించి బుల్లితెర అభిమానులను ఆకట్టుకోవడంలో జీ తెలుగు టీవీ ఛానెల్ (Zee Telugu TV channel) ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్‌ని అందించి అటు క్రియెటివిటీకి, ఇటు మంచి అభిరుచి కలిగిన అభిమానులకు మధ్య వారధిగా నిలుస్తోన్న జీ తెలుగు టీవీ ఛానెల్.. తాజాగా కళ్యాణం కమనీయం అనే మరో సరికొత్త సీరియల్‌తో అభిమానుల ముందుకొస్తోంది. అమ్మ ప్రేమలో కమ్మదనాన్ని, ఆప్యాయతను కళ్లకు కట్టినట్టు చూపించే సరికొత్త కథతో తెరకెక్కుతున్న సీరియల్ ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అమ్మను మించి దైవం ఉన్నదా అనేది ఒక పాట మాత్రమే కాదు.. అక్షర సత్యం కూడా. అమ్మ అనురాగాన్ని, ఆప్యాయతను చూసిన వాళ్లకు ఎవరికైనా అమ్మను మించి దైవం ఉన్నదా (Amma) అని అనిపించకమానదు. అయితే, అమ్మ ఎవరు ? తను ఎలా ఉంటుంది ? అమ్మ ప్రేమెలా ఉంటుందో తెలియకుండానే పెరిగిన ఇద్దరు ఆడబిడ్డలు అమ్మ ప్రేమను వెతుక్కుంటూ వెళ్తే ఎలా ఉంటుంది ? పేగు తెంచుకు పుట్టిన కన్నబిడ్డలను జీవితంలో మళ్లీ ఒక్కసారైనా చూసుకునే భాగ్యం దక్కితే చాలు అని పరితపించే ఓ మాతృమూర్తి ఆవేదన ఎలా ఉంటుంది ? అమ్మను వెతుక్కుంటూ వెళ్లే ఇద్దరు బిడ్డల కథ ఎలా ఉంటుంది ? ఎక్కడున్నారో కూడా తెలియని తన సొంత బిడ్డలను అక్కున చేర్చుకునేందుకు అదే శ్వాసగా బతికే ఆ మాతృమూర్తి ఏం చేసింది అనే కథ, కథనంతో తెరకెక్కుతున్న సీరియలే ఈ కళ్యాణం కమనీయం. 


తల్లీబిడ్డల మధ్య అనురాగ బంధాన్ని కళ్లకుకట్టినట్టు, హృద్యంగా, అభిమానుల గుండెకు హత్తుకునేలా తెరకెక్కిన కళ్యాణం కమనీయం సీరియల్ (Kalyanam Kamaneeyam serial) ఈ జనవరి 31 నుంచి రాత్రి 7.30 గంటలకు మీ అభిమాన జీ తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. 



 


ఆడియెన్స్‌ని టీవీలకు అతుక్కుపోయేలా చేసే కథతో.. 
కళ్యాణం కమనీయం సీరియల్ కథ విషయానికొస్తే.. సీతారత్నం (హరిత) ఒక శరణాలయాన్ని నడిపే సాధారణ గృహిణి. అందరూ బాగుండాలని కోరుకొనే మంచి మనిషి. మరోవైపు వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన చైత్ర పాత్రలో మేఘన లోకేష్ కనిపించనున్నారు. తన తండ్రి (సింగర్ మనో) ఆఖరి నిమిషింలో తనకు, తన చెల్లికి వారి అమ్మ గురించిన ఓ నిజాన్ని చెబుతారు. అలా అమ్మ గురించి తెలుసుకున్న అక్కాచెల్లెళ్ళు అమ్మ ఎలా ఉంటుందో, ఎక్కడ ఉంటుందో అని తెలుసుకునే పనిలో పడతారు. విచిత్రం ఏంటంటే.. విధి ఆడిన వింత నాటకంలో వీరు తమకి తెలియకుండానే సీతారత్నం చెంతకి చేరుతారు. ఇదిలా ఉంటే, సీతారత్నం కోసం రాక్‌స్టార్ విరాజ్ (మధు)కి డాక్టర్ చైత్ర ఎదురునిలబడుతుంది. రాక్ స్టార్ విరాజ్, డాక్టర్ చైత్ర మధ్య ప్రేమ ఎలా మొదలైంది ? సీతారత్నం (Seetharatnam), తన పిల్లలు కలుసుకుంటారా ? చైత్రకు తన అమ్మ దక్కుతుందా ? తెలుసుకోవాలంటే- కళ్యాణం కమనీయం సీరియల్ చూడాల్సిందే. 


కొత్త సంవత్సరంలో అసలు తగ్గెదేలే అంటూ కొత్త షోస్, టెలివిజన్ ప్రీమియర్స్‌తో దూసుకుపోతున్న జీ తెలుగు, అదే ఊపులో ఇప్పుడు కళ్యాణం కమనీయం అనే సీరియల్‌ని మన అందరి ముందుకు తీసుకురానుంది. సీనియర్ నటి హరిత (Artist Haritha) రెండేళ్లు తర్వాత జీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సీతారత్నం రూపంలో ఆడియెన్స్ ముందుకు రానుంది. 

Also read : Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. మొసలికి దాన వేయడానికి వెళ్తే.. అదేం చేసిందో చూడండి..


అఖిలాండేశ్వరి తర్వాత సీతారత్నం పాత్రలో...


కళ్యాణం కమనీయం సీరియల్ గురించి నటి హరిత మాట్లాడుతూ.. "జీ తెలుగు టీవీ సీరియల్ (Zee Telugu Tv channel) చేయడం అనేది నాకు పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది. అఖిలాండేశ్వరి తర్వాత మన ఛానెల్ అభిమానులకు సీతారత్నం పాత్రలో కనిపించబోతున్నాను. తల్లి కోసం పిల్లల అన్వేషణ, తన పిల్లలు ఎక్కడ ఉన్నా బాగుండాలి, ఒక్కసారైనా వాళ్లని కలవాలి, వాళ్లని చూడాలనే ఒక తల్లి పడే తపనే ఈ కథ. అందరికీ నచ్చుతుందని, సీతారత్నం పాత్రను అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు. సీతారత్నం, చెైత్ర మరియు విరాజ్ జీవితాలు (Kalyanam Kamaneeyam serial story) ఏ విధమైన మలుపులు తిరుగుతాయో తెలియాలంటే 'కళ్యయణం కమనీయం' ఈ జనవరి 31 నుండి రాత్రి 7:30 గంటలకు తప్పకచూడండి.


Also read : Good Luck Sakhi first review: కీర్తి సురేష్ అదరగొట్టిందట, గుడ్‌ లక్‌ సఖి మూవీ ఫస్ట్‌ రివ్యూ!


Also read : Monkey love video: తల్లి ప్రేమ అంటే అంతే మరి.. మనుషులలైనా.. జంతువులైన!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook