Kamal hasan - Maniratnam Movie Announced: తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ దాదాపు 230 కి పైగా సినిమాల్లో నటించారు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ లాగే ఇబ్బంది పడిన ఆయన విక్రమ్ అనే సినిమాతో మళ్ళీ మంచి కం బ్యాక్ ఇచ్చారు. తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఆయన నిరూపిస్తూ విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా తమిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం కమల్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత లోకేష్ కనకరాజు డైరెక్షన్ లోనే మరో సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఆయన మణిరత్నంతో కలిసి సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వాస్తవానికి 35 ఏళ్ల క్రితం వీరిద్దరూ కలిసి నాయకన్ అనే సినిమా చేశారు అది ఆ సమయంలో ఒక సెన్సేషనల్ హిట్గా నిలిచింది.  తెలుగులో దానిని నాయకుడు అనే పేరుతో రిలీజ్ చేయగా తెలుగులో కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కొన్నిసార్లు సినిమా చేయడానికి ప్రయత్నించారు కానీ కాంబినేషన్ సెట్ అవ్వలేదు.


ఇప్పుడు వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడింది. కమల్ హాసన్ కెరియర్ లో 234వ సినిమాగా ఈ సినిమా రూపంతో పోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా మద్రాస్ టాకీస్, రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక కమల్ హాసన్ కూడా నిర్మాణ భాగస్వామ్యం తీసుకోబోతున్నారు.


ఇక కమల్ హాసన్ ప్రస్తుతం నటిస్తున్న ఇండియన్ 2 సినిమా విషయానికొస్తే శంకర్ డైరెక్షన్ లో పొందుతున్న ఈ సినిమాలో కమలహాసన్ రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనకు హీరోయిన్లుగా రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ తల్లి కాబోయే ముందు సినిమా నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి కానీ సినిమా నిలిచిపోయి ఆలస్యంగా ప్రారంభం కావడంతో రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: Balakrishna - Chiranjeevi: బాలయ్య- చిరు ఫాన్స్ కు అదిరే న్యూస్.. ఇక ఆ టెన్షన్ పడక్కర్లేదు!


Also Read: Naga Chaitanya Calls Samantha: పుట్టెడు దుఃఖంలో సమంత.. అభయమిచ్చిన చైతూ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook