Bharateeyudu 2 Review: టాలీవుడ్ లో ఎప్పటినుంచో ఒక సెంటిమెంట్ ఉంది. బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్.. అంత త్వరగా హిట్ అవ్వవు. అందుకే చాలామంది స్టార్ డైరెక్టర్లు కూడా తమ ..బ్లాక్ బస్టర్ సినిమాలకి సీక్వెల్స్..తీయడానికి భయపడతారు. సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ అంటేనే సినిమాపై.. అంచనాలు భారీగా పెరిగిపోతాయి. తరువాత ఆ అంచనాలు అందుకోవడం మామూలు కథల వల్ల.. అవ్వదు. కాబట్టి సినిమా ఫ్లాప్ అవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా సీక్వెల్స్ అంటూ వెళ్లి చాలా మంది డైరెక్టర్లు చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్, రవితేజ కిక్ 2, నాగార్జున మన్మధుడు 2 ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు సీక్వెల్స్.. టాలీవుడ్ లో ఎప్పుడు వచ్చాయో తెలియకుండానే డిజాస్టర్లు గా వెనక్కి వెళ్లిపోయాయి. 


దృశ్యం, కార్తికేయ వంటి సినిమాల సీక్వెల్స్ చాలా అరుదుగా హిట్ అయ్యాయి. కానీ అది అన్ని.. సినిమాలకి వర్తించదు. తాజాగా ఇప్పుడు విడుదలైన భారతీయుడు 2 కూడా దీనికి సాక్ష్యం. 1996లో విడుదలైన భారతీయుడు సినిమా ఒక కల్ట్ క్లాసిక్. శంకర్ డెబ్యూ సినిమా అయినప్పటికీ స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టిన సినిమా అది.


సినిమా విడుదలైన 28 ఏళ్ల తర్వాత 2024లో ఈ సినిమాకి సీక్వెల్ భారతీయుడు 2 విడుదలైంది. ఎంత భారీ అంచనాల మధ్య ఆ విడుదలైనప్పటికీ, సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ అందుకుంటుంది. కమల్ హాసన్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో మళ్లీ అదే కాంబినేషన్ లో సినిమా వచ్చినప్పటికీ, సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడింది.


బాహుబలి, కే జీ ఎఫ్ వంటి సినిమాలకు రెండం భాగాలుగా వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి కానీ అవి సీక్వెల్స్ కింద లెక్క కట్టలేము. అయితే టిల్లు స్క్వేర్ లాంటి హిట్స్ ఉన్నాయి కానీ ఈ సీక్వెల్స్ ఫార్ములా అంతగా టాలీవుడ్ కి అచ్చి రావడం లేదు. పైగా కొన్ని కొన్ని క్లాసిక్ సినిమా లని సీక్వెల్స్ అంటూ మళ్ళీ ఇలా సినిమాలు చేసి రిస్క్ తీసుకోకపోవడమే బెటర్ అని అనిపిస్తూ ఉంటుంది.


Read more: Snake bite: పాముపగ నిజమా..?.. 40 రోజుల్లో 7 సార్లు కాటు.. 9 వ సారి చస్తానంటూన్న వికాస్ దూబే.. మిస్టరీగా మారిన ఘటన..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి