Bharateeyudu 2 Collections Day 1: ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో.. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం భారతీయుడు 2. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. భారీ అంచనాల మధ్య.. ఈరోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి శంకర్ డైరెక్షన్ లో సినిమాలు అంటే ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఆ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. పైగా ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి గల కారణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా..మారుతున్నాయి. మరి భారతీయుడు 2 సినిమా డిజాస్టర్ అవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. 


భారతీయుడు సినిమా యాక్షన్ సీక్వెన్స్లతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.. అయితే ఇండియన్ 2 సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను లాగదీయడం అతిపెద్ద మిస్టేక్ అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ను ఈ సినిమాలో పెట్టారు అని చెప్పారు.. కానీ ఈమె సన్నివేశాలు ఇండియన్ 3.. సినిమాలో ఉంటాయని నిరాశపరిచారు.


పైగా భారతీయుడు 2 సినిమాను మాత్రమే తీయకుండా ఈ సినిమాకు కొనసాగింపుగా.. భారతీయుడు 3 సినిమా తీస్తామని చెప్పి.. ఇందులో క్యారెక్టర్ లను సరిగా వాడుకోకపోవడం మరో అతిపెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ముఖ్యంగా ఎస్ జె సూర్య, బాబీ సింహ పాత్రలను పెద్దగా ఎలివేట్ చేయలేదు.


హాస్యానికి కేరాఫ్ అడ్రస్ బ్రహ్మానందం. గ్లామర్ కి పెట్టింది పేరు రకుల్ ప్రీత్ సింగ్. ఇలాంటి గొప్ప సెలబ్రిటీలను సినిమాలో పెట్టారు.. కానీ వీరిని సరిగా వాడుకోవడంలో శంకర్ ఫెయిల్.. అయ్యారని చెప్పాలి. 


ముఖ్యంగా ఇండియన్ 2 సినిమాకు ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాల్సి ఉంది. కానీ ఆయన వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల అనిరుధ్ ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఇక్కడ ఈ సినిమాకు మ్యూజిక్ కూడా పెద్ద మైనస్ అయ్యింది. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే రెండు పాటలు కూడా.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. కనీసం అక్కడ పాటలు పెట్టకుంటే.. సినిమా నిడివి తగ్గి…ప్రేక్షకులను కొంతవరకు మెప్పించేదేమో.


ఇక సినిమాను ల్యాగ్ చేశారు.. రెండున్నర గంటల్లో ముగించాల్సిన సినిమాను.. మూడు గంటల వరకు పొడిగించేసరికి ఆడియన్స్ కు కాస్త బోర్ కొత్తగా తప్పలేదు. పైగా సినిమా మొత్తం లాజిక్కులు మిస్ అయ్యారు శంకర్. వందల మంది సెక్యూరిటీ ఉన్నా.. భారతీయుడు మాత్రం చాలా సులభంగా ఇంట్లోకి వెళ్లి చంపేస్తారు. ఎలా అనేది మాత్రం ఎవరికీ తెలియదు.. భారీ  భద్రతను తప్పించుకొని అన్ని రాష్ట్రాలను చుట్టేస్తాడు. ఇది ఎలా సాధ్యం అనే లాజిక్ మిస్ అయ్యారు. పైగా కథ,  కథనం పాత చింతకాయ పచ్చడిలా ఉండడంతో.. ప్రేక్షకులను నొప్పించలేకపోయింది. ఇలా కొన్ని చిన్న చిన్న తప్పిదాలు సినిమాకు పెద్ద మైనస్ గా నిలిచాయి.. ఈ మిస్టేక్స్ లేకపోయి.. ఉండి ఉంటే కచ్చితంగా భారతీయుడు 2 సినిమా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేది.


Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.


Read more: SpiceJet woman slaps: అంతమాటన్నాడా..?.. పోలీసును లాగిపెట్టి కొట్టిన స్పెస్ జెట్ ఉద్యోగిని.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి