Indian 2 OTT Date: జూలై 12న విడుదలైన భారతీయుడు 2 బ్లాక్ బస్టర్ హిట్ కాలేకపోయింది. విలక్షణ నటుడు కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన సినిమాకు పెద్దగా వసూళ్లు రాలేదు. దాంతో అనుకున్నదానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 ఏళ్ల క్రితం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆరేళ్ల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభమైనా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు జూలై 12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇది. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, ల్యాగ్, శంకర్ మార్క్ మిస్ అవడం వంటి కారణాలతో పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. అంటే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు. ఇప్పటి వరకూ కేవలం 100 కోట్లే వసూలు చేయగలిగిందని తెలుస్తోంది. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే కచ్చితంగా కలెక్షన్లు రెట్టింపయ్యేవంటున్నారు సినీ విశ్లేషకులు.


ఇప్పుడీ సినిమాను త్వరగా ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా  ఓటీటీ హక్కుల్ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముందుగా అనుకున్న ప్రకారమైతే ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల కావాలి. కానీ ఇప్పుడు ఆగస్టు 2వ తేదీన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. 


భారతీయుడు 2కు సీక్వెల్ భారతీయుడు 3 కూడా ఉంటుంది. భారతీయుడు 3 ట్రైలర్ ఇప్పటికే ఈ సినిమా చివర్లో కన్పిస్తుంది. భారతీయుడు 3 మాత్రం ఈ ఏడాది చివర్లో విడుదల కావచ్చని అంచనా ఉంది. 


Also read: Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook