కరోనాతో ఆసుపత్రిలో చేరిన కమల్ హాసన్.. జాగ్రత్తగా ఉండండి అంటూ అభిమానులకు ట్వీట్
Kamal Haasan tests positive for COVID-19: లోక నాయకుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఇటీవలి అమెరికా పర్యటన తర్వాత కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
Kamal Haasan tests positive for COVID-19 : సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) కరోనా బారినపడ్డారు. ఇటీవలి అమెరికా పర్యటన తర్వాత కొద్దిపాటి దగ్గుతో బాధపడినట్లు తెలిపారు. కరోనా అనుమానంతో టెస్టులు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. ప్రస్తుతం చెన్నైలోని (Chennai) ఓ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కమల్ హాసన్ తన ట్విట్టర్ ద్వారా ఈ వివరాలు వెల్లడించారు.
'కరోనా మహమ్మారి ఇంకా అంతం కాలేదని గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి.' అంటూ అభిమానులను ఉద్దేశించి కమల్ హాసన్ (Kamal Haasan) తమిళంలో ట్వీట్‌లో చేశారు. కమల్ కరోనాతో ఆసుపత్రిలో చేరారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కమల్ ఆరోగ్యం నిలకడగానే ఉందని... అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని మక్కల్ నీది మయ్యం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కమల్ హాసన్ ఇటీవలే 'కేహెచ్ హౌజ్ ఆఫ్ ఖద్దర్ బ్రాండ్' (KH House of Khaddar) పేరుతో వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అమెరికాలోని చికాగోలో నవంబర్ 15న దీనికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. భారతీయ ఖద్దరును ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో కమల్ ఈ బ్రాండ్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చారు.
Also Read:కైకాల సత్య నారాయణ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంచీపురం చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని కమల్ (Kamal Haasan) హామీ ఇచ్చారు. తాజాగా తాను లాంచ్ చేసిన బ్రాండ్ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే... కమల్ ప్రస్తుతం 'విక్రమ్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఖైదీ ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook