Vikram teaser launching on Kamal Haasan's birth day: లోక నాయకుడు కమల్ హాసన్ అప్‌కమింగ్ సినిమా విక్రమ్ మూవీ టీజర్ విడుదలకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. రేపు నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఖైదీ, మాస్టర్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మళయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విజయ్ ఇళయ దళపతి నటించిన మాస్టర్ మూవీతో (Master Movie) దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో మాస్టర్ మూవీ తర్వాత విక్రమ్ మూవీపై సైతం కమల్ హాసన్ అభిమానుల్లో అంతే భారీ అంచనాలు ఉన్నాయి. 


కమల్ హాసన్‌ను ఇంతకు ముందెప్పుడూ, ఏ దర్శకుడూ చూపించని విధంగా వినూత్నమైన పద్ధతిలో లోకేష్ కనగరాజ్ చూపించనున్నట్టు మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. విక్రమ్ సినిమాపై (Vikram movie) కమల్ హాసన్ అభిమానుల్లో అంచనాలు పెరగడానికి ఇది మరో కారణమైంది. అభిమానుల అంచనాలను విక్రమ్ టీజర్ ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తుందో తెలియాలంటే రేపు కమల్ హాసన్ బర్త్ డే (Kamal Haasan birth day) సందర్భంగా టీజర్‌ని విడుదల చేసే వరకు వేచిచూడాల్సిందే.