Kangana Ranaut illness ప్రస్తుతం హీరోయిన్లంతా కూడా అనారోగ్యం పాలవుతున్నారు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా హీరోయిన్లు మంచాన పడుతున్నారు. తాజాగా కంగనా రనౌత్ తనకు ఎదురైన ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా కంగనా రనౌత్‌ తాను అనుభవించిన కష్టాలు, ఎదురైన అనారోగ్య సమస్యల గురించి పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చూస్తే ఎంతో మంది ఆమెను ఇన్‌స్పైరింగ్‌గా తీసుకునేలా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



నేను నటిగా ఎమర్జెన్సీ షూటింగ్‌కు గుడ్ బై చెప్పేశాను.. ఈ సినిమా కోసం షూటింగ్ చేసిన సమయంలోనే నా జీవితం మొత్తం సంపూర్ణమైన ఫీలింగ్ వచ్చింది.. ఎంతో గొప్పగా షూటింగ్ జరిగిందని నేను చెప్పొచ్చు. కానీ అది అబద్దమే అవుతుంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సమయంలోనే నేను డెంగ్యూ బారిన పడ్డాడు. అప్పుడు ఎన్నో కష్టాలు నన్ను చుట్టుముట్టాయి. రక్తకణాలు తగ్గిపోయాయి. నా మీద నాకే అనుమానం వచ్చే స్థితికి వచ్చాను.. ఆ దేవుడు నాకు పరీక్షలు పెడుతున్నట్టుగా అనిపించింది.


నేనెప్పుడూ కూడా సోషల్ మీడియాలో నా భావాలను పంచుకుంటూనే ఉంటాను.. కానీ నా ఆరోగ్య సమస్యల గురించి ఎక్కడా కూడా నోరు విప్పలేదు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారంతా కూడా ఆందోళన చెందొద్దని కోరుకున్నాను.. ఆ వారి ప్రేమ, ఆందోళన మళ్లీ నా మీద ఒత్తిడిని తీసుకురావొద్దని అనుకున్నాను.. నేను పడిపోతే చూడాలని అనుకునేవారికి చాన్స్ ఇవ్వకూడదని అనుకున్నాను.. నేను ఎంతగా బాధపడుతూ ఉన్నా కూడా బయటకు చెప్పలేదు.. నా బాధ వారికి ఆనందాన్ని కూడా ఇవ్వొద్దని అనుకున్నాను.


కానీ ఇప్పుడు ఇదంతా నేను చెప్పడానికి ఓ కారణం ఉంది.. మన మీద మనకు నమ్మకం ఉండి.. మనం కష్టపడి పని చేస్తే..  నువ్ సమర్థురాలివి అయితే నిన్ను ఆ దేవుడు మరింత ఎక్కువగా పరీక్షిస్తుంటాడు.. ఆ పరీక్షల్లో నెగ్గాల్సిందే. దానికి కష్టపడాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టొద్దు.. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు పునఃజర్మ వంటిది.. నాకైతే ఇది మళ్లీ చచ్చి పుట్టినట్టు అనిపిస్తుంది.. దానికి సాయం చేసిన నా టీంకు థాంక్స్.. నా గురించి ఎవ్వరూ కంగారు పడకండి.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను.. ఇప్పుడు మీ ప్రేమ, అదరాభిమానాలు, ఆశీస్సులు నాకు కావాలి అంటూ కంగనా ఎమోషనల్ పోస్ట్ చేసింది.


Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?


Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook