ప్రాన్స్‌లో కేన్స్ తీరాన జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరైన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఆహుతుల మతులు పోగొట్టింది. కంగనా వెళ్లింది బాలీవుడ్ తరుపునా లేక హాలీవుడ్ తరుపునా అనేంతగా లుక్ మొత్తం మార్చేసుకుంది. పూర్తి మోడ్రన్ కల్చర్‌లో దుస్తులు, గాగుల్స్, హెయిర్ స్టైల్ అన్నీ పూర్తిగా మారిపోయాయి. కేన్స్‌లో కంగనా రనౌత్ బాడీ లాంగ్వేజ్ చూస్తే, భవిష్యత్తులో కంగనాకు భారీగానే హాలీవుడ్ ఆఫర్స్ తలుపు తట్టడం ఖాయం అనిపిస్తోంది. మూడుసార్లు నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరోయిన్ కేన్స్‌లో అప్పీయరెన్స్ ఇచ్చిన తీరు ఆసక్తిని రేకెత్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రముఖులు పాల్గొనే ఈ ఫిలిం ఫెస్టివల్‌లో కంగనా తన డ్రెస్సింగ్ స్టైల్‌తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేయడంలో సక్సెస్ అయింది. ఇన్నర్‌వేర్ కనిపించేవిధంగా ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ ట్రుసార్డి డిజైన్ చేసిన దుస్తులు ధరించి కేన్స్ వీధుల్లో సందడి చేసిన కంగనా రనౌత్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



కంగనా రనౌత్ కేన్స్‌కి హాజరవడం ఇదే మొదటిసారి కాగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి రెగ్యులర్ గెస్ట్ అయిన ఐశ్వర్యా రాయ్ బచ్చన్ సైతం తన గారాలపట్టి ఆరాధ్య బచ్చన్‌తో కలిసి కేన్స్‌కి వెళ్లింది. శనివారం, ఆదివారం జరిగే రెడ్ కార్పెట్ వాక్‌లో ఐష్ రెడ్ కార్పెట్‌పై సందడి చేయనుంది. ఐష్ కేన్స్‌కి వెళ్లడం ఇది 17వ సారి కావడం విశేషం.