Kangana Ranaut Wrap up Chandramukhi రజినీకాంత్ పీ వాసు కాంబోలో వచ్చిన చంద్రముఖి సినిమా సౌత్‌లో సెన్సేషన్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ సీక్వెల్ పనులు కరోనా సమయంలో మొదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో లారెన్స్ నటిస్తున్నాడు. ఇక చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను తాను పూర్తి చేసుకున్నాను అని కంగనా చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



'నేను ఈ రోజు చంద్రముఖి షూటింగ్‌ను పూర్తి చేశాను. టీంను వదిలి వెళ్లాలంటే కాస్త కష్టంగా ఉంది. ఎంతో మంచి టీం నాకు దొరికింది. నా వద్ద లారెన్స్ సర్‌తో దిగిన ఫోటోలేమీ లేవు. అందుకే ఈ రోజు మార్నింగ్ షూటింగ్ తరువాత ఇలా ఫోటోలు దిగాను. ఆయన్ను లారెన్స్ మాస్టర్ అని పిలుస్తాను.. ఆయన కెరీర్‌ను కొరియోగ్రాఫర్‌గా మొదలుపెట్టి.. బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు.. అన్నింటికి మించి ఆయన చాలా మంచి వ్యక్తి.. గొప్ప మనసున్నవాడు.. ఎంతో నవ్విస్తుంటారు.. మీతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది' అంటూ కంగనా రనౌత్ పోస్ట్ వేసింది.


కంగనా రనౌత్‌కు ప్రస్తుతం టైం బాగా లేనట్టుగా కనిపిస్తోంది. ఆమె చేస్తోన్న సినిమాలేవీ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఆమె హిట్టు చూసి కూడా చాలా కాలమే అయింది. హిట్ల సంగతి పక్కన పెడితే.. కాంట్రవర్సీలకు మాత్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మణికర్ణిక విషయంలో క్రిష్‌ను పక్కన పెట్టడం నుంచి, శివ సేనతో ఢీ అంటే ఢీ అంటూ పోటికి దిగడం, సుశాంత్ సింగ్ కేసులో బాలీవుడ్‌ను విమర్శించడం వరకు అన్నింట్లోనూ కంగనా పేరు ఎక్కువగానే వైరల్ అయింది.


ఇక కంగనాను బాలీవుడ్ సైతం పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. హృతిక్ రోషణ్ కంగనా రనౌత్ వివాదం కూడా అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరి రిలేషన్ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది. కంగనా తన సినిమాల కంటే పర్సనల్ విషయాలతోనే ఇప్పుడు ఫేమస్ అవుతోంది. కంగనా నటించిన ధాకడ్ దారుణంగా బోల్తా కొట్టేసింది. తలైవి సినిమా సైతం అంతగా మెప్పించలేకపోయింది.


Also Read:  Samantha Stylist Preetham : అర్దనగ్నంగా సమంత ఫ్రెండ్ ప్రీతమ్.. ఆ మూడ్‌లో ఉన్నట్టున్నాడే


Also Read: Shriya Saran Pics : ఇంతకంటే క్లియర్‌గా ఎవ్వరూ చూపించరేమో.. శ్రియా ఎద అందాల ప్రదర్శన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook