Kannada Actor Chandan Kumar attacked: కన్నడ బుల్లితెర పరిశ్రమలో నటుడు చందన్ కుమార్ మంచి ఫేమస్. కన్నడ నాట ఫేమస్ అయిన వారిని తీసుకొచ్చి తెలుగులో మంచి స్పేస్ ఇస్తున్నారు మనవాళ్లు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన శ్రీమతి శ్రీనివాస్ అనే సీరియల్ లో హీరో పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సీరియల్ కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతున్న సమయంలో ఆయన మీద సీరియల్ యూనిట్ దాడికి దిగిన విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుమారు పదుల సంఖ్యలో సీరియల్ కెమెరామెన్ సహా ఇతర యూనిట్ సభ్యులు ఆయనని చుట్టుముట్టి దుర్భాషలాడుతూ దాడి చేస్తున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సారీ చెప్పాలని ఒకపక్క దుర్భాషలాడుతూనే మరోపక్క నువ్వు ఏమైనా మెగాస్టార్ అనుకుంటున్నావా? అంటూ ప్రశ్నించడం కూడా మనం వీడియోలో చూడొచ్చు. అంతేగాక యూనిట్ లో ఉన్న సభ్యుడు చందన్ చెంపపై కూడా కొట్టిన విజువల్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటన గురించి చందన్ బెంగళూరు వెళ్ళిన తర్వాత మీడియా ముఖంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.


తన తల్లికి బాగోలేదని ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉండడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇది చాలా చిన్న విషయం అని పేర్కొన్న ఆయన ఈ సంఘటన జరగక ముందు కొంచెం టెన్షన్ లో ఉన్నానని అన్నారు. తన తల్లి బెంగుళూరులోని హాస్పిటల్ లో ఉండగా తాను షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చిందని కానీ అక్కడేమో షూటింగ్ సరిగ్గా జరగడం లేదని అన్నారు. ఆ తలనొప్పి వేరేది కానీ షూటింగ్ సరిగ్గా జరగకపోవడంతో నేను అక్కడ పని చేసే వారికి చెప్పి నిద్రపోవడం కోసం వెళ్లాను.


అయితే అసిస్టెంట్ డైరెక్టర్ కొంచెం సిగ్గరి కావడంతో ప్రతి పది నిమిషాలకు వచ్చి షూట్ మొదలవుతుంది రమ్మన్నారని అన్నాడని, చివరికి సరే నేను వస్తున్నాను అని చెబితే గట్టిగా ఐదు నిమిషాలా- అరగంటా అని అనడం వినిపించిందని నేను కోపంతో ఆ అబ్బాయిని కాస్త వెనక్కి తోయడంతో నేను వెళ్లి కొట్టినట్టుగా ఆయన డైరెక్టర్ కి చెప్పడంతో గొడవ జరిగిందని అన్నారు. ఆ సమయంలో కాస్త టెన్షన్ గా ఉండడం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే నెటిజన్లు మాత్రం చందన్ కుమార్ కు అండగా నిలబడ్డారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీకు అండగా ఉంటాం అంటూ ఆయన అభిమానులు ఆయనకు అండగా నిలబడుతూ కామెంట్లు చేస్తున్నారు.


Also Read: Vijay Devarakonda:ఇదెక్కడి క్రేజ్‌రా అయ్యా.. విజయ్ దేవరకొండకి ముంబైలో మెంటల్ మాస్ ఫాలోయింగ్


Also Read: Telugu Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజయ్యే తెలుగు సినిమాలివే



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook