Tanisha Kuppanda Interview: న్యూడ్ ఫిలింస్‌లో నటిస్తారా..? అని అడిగిన యూట్యూబర్.. కేసు పెట్టిన కన్నడ స్టార్ హీరోయిన్
Tanisha Kuppanda Interview: తనిషాకు అంత చిర్రెత్తుకొచ్చే ప్రశ్నలు సుషాన్ ఏం అడిగాడా అనే కదా మీ సందేహం .? ఆ వివరాలు తెలుసుకోవడానికంటే ముందుగా తనిషా కుప్పాండ గురించి తెలుసుకోవాలి. మంగళ గౌరి మడువే అనే టీవీ సీరియల్ తో తనిషా కుప్పాండకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఆ తరువాత ఇటీవలే పెంటాగాన్ అనే కన్నడ మూవీలో ఓ పాటలో కనిపించింది.
Actress Tanisha Kuppanda Filed a case on YouTuber Sushaan: కన్నడ హీరోయిన్ తనిషా కుప్పాండ తనను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబర్ సుషాన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను అసభ్యకరమైన ప్రశ్నలతో వేధించి, తన పరువు - ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరించిన యూట్యూబర్ సుషాన్ పై కేసు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తనిషా కుప్పాండ తన ఫిర్యాదులో పేర్కొంది. మీడియాకు ఏమైనా అడిగే స్వేచ్ఛ ఉంది కదా అని మరొకరి స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించే హక్కు వారికి ఎవరు ఇచ్చారని తనిషా ప్రశ్నించింది. స్వేచ్ఛ ఇవ్వడం అంటే.. ఎలాంటి ప్రశ్నలు పడితే అలాంటి ప్రశ్నలు అడిగేందుకు లైసెన్స్ ఇచ్చినట్టు కాదు అంటూ సుషాన్ పై తనిషా మండిపడింది.
తనిషాకు అంత చిర్రెత్తుకొచ్చే ప్రశ్నలు సుషాన్ ఏం అడిగాడా అనే కదా మీ సందేహం..? ఆ వివరాలు తెలుసుకోవడానికంటే ముందుగా తనిషా కుప్పాండ గురించి తెలుసుకోవాలి. మంగళ గౌరి మడువే అనే టీవీ సీరియల్ తో తనిషా కుప్పాండకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. ఆ తరువాత ఇటీవలే పెంటాగాన్ అనే కన్నడ మూవీలో ఓ పాటలో కనిపించింది. ఆ సాంగ్ కూడా భారీగా పాపులారిటీ లభించింది. దీంతో తనిషాకు ఇంకొంత ఇమేజ్ రెట్టింపయ్యింది.
ఇదిలావుండగా.. తాజాగా తనిషాను ఇంటర్వ్యూ చేసిన సుషాన్.. పెంటాగాన్ చిత్రంలో పాట గురించి మాట్లాడిన అనంతరం.. ఆమె భవిష్యత్ ప్లాన్స్ గురించి అడిగి తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే మరిన్ని ప్రశ్నలు అడుగుతూ.. మీరు నగ్నంగా కనిపించే న్యూడ్ ఫిలింస్‌లో నటిస్తారా అని అడిగాడు. సుషాన్ అడిగిన ప్రశ్న విన్న తనిషా.. ఒకింత ఆగ్రహంగానే స్పందించింది.
తానేమీ బ్లూ ఫిలింస్‌లో నటించడం లేదని.. ఎంతో కష్టపడి చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఈ స్థాయికి వచ్చానని చెప్పుకొచ్చింది. ఎంతో కష్టపడిన తరువాతే పెంటాగాన్ మూవీలో ఆ పాత్ర చేసే ఆఫర్ వచ్చిందని యూట్యూబర్ సుషాన్‌కి గట్టిగానే రిప్లై ఇచ్చింది. ఇంటర్వ్యూలో సుషాన్ అడిగిన ఈ న్యూడ్ ఫిలింస్‌లో నటిస్తారా అనే ప్రశ్న కూడా వైరల్‌గా మారింది. దీంతో అది తనకు జరిగిన అవమానంగానే భావించిన తనిషా.. అతడిపై మల్లేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఒక రకంగా యూట్యూబర్‌పై పోలీసులు తీసుకునే చర్యలను బట్టే ఎంతో మంది యూట్యూబర్ల ఆకతాయి ప్రశ్నలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : Actress Love Break-up: మరో హీరోయిన్ బ్రేకప్ రూమర్స్.. ఫోటోలు కూడా డిలీట్
ఇది కూడా చదవండి : Nysa Devgan, Kajol Viral Pics: తల్లీకూతుళ్ల బ్యూటీ ట్రీట్.. చూసిన వాళ్లకు ఫ్యూజుల్ ఔట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook