Kalki 2898 AD: కల్కి బుజ్జితో కాంతారా.. ప్రభాస్ సినిమా కోసం రిషబ్ శెట్టి ప్రమోషన్
Bujji in Kalki: కల్కి సినిమా ప్రమోషన్స్ లో.. భాగంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాత అశ్విని దత్.. కలిసి సినిమాలో ఉండే బుజ్జి అనే కార్ ను.. నిజంగా సృష్టించి.. మరి బయటకు తీసుకువచ్చారు. ఇప్పటికే పలుచోట్ల హంగామా.. చేసిన ఈ కార్..ఇప్పుడు కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి చేతుల్లో పడింది. దీనికి సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rishab Shetty about Kalki Bujji: ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో.. ప్రేక్షకుల ముందుకి వస్తున్న మొదటి సినిమా కల్కి 2898 ఏడి. భారీ అంచనాల మధ్య.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, రెండు అద్భుతమైన ట్రైలర్లు, సినిమాకి సంబంధించిన అప్డేట్లు సినిమాకి భారీ రేంజ్ లో హైప్ ఇచ్చేసాయి.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం.. సినిమాలో చూపించినటువంటి రోబోటిక్ కార్ బుజ్జిని.. రియల్ గా సృష్టించి బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. చెన్నై, హైదరాబాద్, ముంబై లలో ఈ కార్ ని పెట్టగా చాలామంది అభిమానులు.. వచ్చి దానితో ఫోటోలు దిగారు. సినిమాలో బుజ్జి పాత్రకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో ఈ పాత్రకి మరింత క్రేజ్ వచ్చింది.
తాజాగా ఇప్పుడు బుజ్జి కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి.. చేతుల్లో పడింది. కాంతారా సినిమాతో.. బ్లాక్ బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. సినిమా ప్రమోషన్స్ లో రిషబ్ శెట్టి కూడా పాల్గొంటూ బుజ్జి కారుని డ్రైవ్ చేసేసారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
"టీజర్ లో బుజ్జి గ్లింప్స్ చూడగానే నాకు సినిమాలో బుజ్జి రేంజ్ ఎలా ఉండబోతుందో అర్థం అయిపోయింది. బుజ్జి ని డ్రైవ్ చేయడం ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆల్ ద బెస్ట్ భైరవ అండ్ బుజ్జి. కల్కి సినిమా జూన్ 27న విడుదల కాబోతోంది. మీ అందరూ కచ్చితంగా థియేటర్లకు వెళ్లి సినిమాని చూడండి. ఆల్ ద బెస్ట్ ప్రభాస్ సార్" అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు రిషబ్ శెట్టి.
దీపిక పడుకొనే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ ఇలా చాలా మంది నటీనటులు సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరిగింది.
Also Read: KTR: ఎమ్మెల్యేల జంప్ జిలానీలపై కేటీఆర్ సంచలన ట్వీట్.. మాస్ వార్నింగ్
Also Read: Sanjay Kumar: బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఐదో వికెట్ డౌన్.. కాంగ్రెస్‌లోకి జగిత్యాల ఎమ్మెల్యే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter