Ginna Worldwide collections : దీపావళి సందర్భంగా నాలుగు చిత్రాలు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కార్తీ సర్దార్, విశ్వక్ సేన్ ఓరి దేవుడో, శివ కార్తికేయన్ ప్రిన్స్, మంచు విష్ణు జిన్నా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. వీటితో పాటు అంతకు ముందు వారం రిలీజ్ అయిన కాంతారా కూడా ఉంది. అయితే దివాళికి రిలీజ్ అయిన చిత్రాల్లో దాదాపు అన్నింటికి అంతో ఇంతో పాజిటివ్ టాకే వచ్చింది. అయితే మంచు విష్ణు జిన్నా మాత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ఇంకా మంచు విష్ణు జిన్నా మీద ట్రోల్స్ పడుతూనే ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలెక్షన్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఓవర్సీస్‌లో అయితే అందరూ వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ మన విష్ణు అన్నా అయితే వన్ కే డాలర్ అంటే వెయ్యి డాలర్లు కొట్టేందుకు చాలా కష్టపడ్డాడు. మూడు రోజుల వసూళ్లు అన్నీ కలిపితే వెయ్యి డాలర్లను కలెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆ మొత్తం రెండు వేల డాలర్లు కూడా కాలేదనిపిస్తోంది.


ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే జిన్నా పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం పది టికెట్లు తెగితే గానీ షోలు వేయమని రద్దు చేస్తున్నారట. .జిన్నా పరిస్థితి ఇలా ఉంటే.. సర్దార్ క్లీన్ హిట్‌గా నిలిచింది. బ్రేక్ ఈవెన్ సాధించి విజయం సాధించింది. ఓరి దేవుడా పర్వాలేదనిపిస్తోంది. ఇక ప్రిన్స్ సినిమా అయితే బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే.. కాంతారా మాత్రం సైలెంట్‌గా దూసుకుపోతూనే ఉంది.


ఈ సినిమా ఇప్పటికే లాభాల పంట పండిస్తోంది. రెండు కోట్లు పెట్టి కొన్ని ఈ సినిమాతో అల్లు అరవింద్ ఇంట కాసుల వర్షం కురుస్తోంది. ఇప్పటికే దాదాపు పదహారు కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. అంటే దగ్గరదగ్గరగా పద్నాలుగు కోట్ల షేర్ లాభంగా వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ దీపావళి సీజన్లో సర్దార్ నెగ్గినా.. అసలు విజయం మాత్రం కాంతారాదే. ఇక జిన్నా పరిస్థితే అగమ్యగోచరంగా కనిపిస్తోంది. కనీసం లాంగ్ రన్‌లో కోటి షేర్ సాధిస్తుందా? అనే అనుమానం కలిగిస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటి వరకే కేవలం యాభై లక్షల షేర్ మాత్రమే వచ్చినట్టు సమాచారం.


నోట్: ఈ సమాచారాన్ని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, దీన్ని  జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.


Also Read : Nayanthara Surrogacy Report : నయనతార సరోగసి వివాదం.. హడావిడి చేసిన ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇదే  


Also Read : Ketika Sharma Latest Pics : కేతిక.. పుట్టించావ్ లోలోపల కాక.. 'రొమాంటిక్' పోజులు
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి