Kapatadhaari​​ Theme Trailer: సుమంత్ హీరోగా నటించిన కపటధారి మూవీ ఫిబ్రవరి 19 విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన థీమ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. కపటధారి థీమ్ ట్రైలర్‌లో చూపించిన దృశ్యాలు చూస్తోంటే.. సినిమాలో అనేక ట్విస్టులు, ఉత్కంఠకు గురిచేసే మలుపులు ఎన్నో ఉన్నాయనిపిస్తోంది. వృత్తిరీత్యా ట్రాఫిక్ పోలీస్ అయిన ఓ ఆఫీసర్.. క్రైమ్ విభాగం పోలీసులు కూడా ఛేదించలేని ఓ Murder mystery ని ఛేదిస్తే ఎలా ఉంటుందనేదే కపటధారి మూవీ కథాంశంగా అర్ధమవుతోంది. విజయ్ ఆంటోనీ నటించిన సైతాన్ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రదీప్ కృష్ణమూర్తి కపటధారి సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also read : Anchor Anasuya item songs: హీటెక్కించే యాంకర్ అనసూయ ఐటం సాంగ్


ఇటీవలే హీరో నాగ చైతన్య Kapatadhaari​ trailer ని విడుదల చేయగా.. తాజాగా కపటధారి థీమ్ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చింది. సుమంత్‌తో పాటు నాజర్, నందితా శ్వేతా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సుమన్ రంగనాథ్, సంపత్ వంటి నటీనటులు Kapatadhaari​ movie లో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రిషి, అనంత్ నాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నడ సూపర్ హిట్ చిత్రం కవలుదారీకి ( Kavaludhaari ) తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా ఇది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook