kapunadu Ultimatum to Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన్ని అనుకోని వివాదంలోకి నెట్టేశాయి. ఈ సక్సెస్ మీట్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ ఒక నటుడిని ఉద్దేశిస్తూ ఈయనతో కూర్చుంటే కాలమే తెలియదని పురాణాల మొదలు ఆ రంగారావు ఈ రంగారావు మా నాన్నగారి గురించి అక్కినేని తొక్కినేని అంటూ చాలా మాట్లాడుకుంటూ ఉంటామని చెబుతూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని వర్గాల వారిని బాధ పెడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకపక్క అక్కినేని అభిమానులు ఈ విషయం మీద క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే మరోపక్క అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ కూడా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ ట్వీట్లు చేశారు. ఇప్పుడు తాజాగా నందమూరి బాలకృష్ణ సహా తెలుగుదేశం పార్టీకి కాపునాడు అల్టిమేటం జారీ చేయడం హాట్ టాపిక్గా మారింది. స్వర్గీయ ఎస్వీ రంగారావు గారిని ఉద్దేశించి నందమూరి బాలకృష్ణ ఆ రంగారావు ఈ రంగారావు అని అనడం ఏ మాత్రం బాలేదని కాపు సామాజిక వర్గం కాపునాడు ఈ విషయాన్ని తీవ్రతి తీవ్రంగా పరిగణించిందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.


గతంలో కూడా రాజకీయాలలో చిరంజీవి విఫలమయ్యారు రాజకీయాల్లో విజయం తమకే సాధ్యం అంటూ మీరు చేసిన మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అనే మాటలు కూడా కాపుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. జనసేన పార్టీలో తిరిగే వారందరూ అలాగా జనం అని సంకరజాతి జనం అని కూడా మాట్లాడి మా కాపుల గుండెల్లో గునపాలు దింపారని ఈ అన్ని విషయాల మీద మీరు 25వ తేదీ సాయంత్రం లోపు మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పని ఎడల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహాల వద్ద కాపు సోదరులందరూ ప్లకార్డులు ప్రదర్శించి మౌన నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.


గతంలో దేవి బ్రాహ్మణులకు సంతకం లేని లేక విడుదల చేసినట్లు కాకుండా స్వయంగా మీడియా ముఖంగా మీరు చేసిన వ్యాఖ్యలకి మన్నించాలని క్షమాపణ కోరాలని మీదట అలాంటి కామెంట్స్ చేయను అని హామీ ఇవ్వని ఎడల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రంగా గారి విగ్రహాల ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ క్షమాపణ చెప్పని ఎడల తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి బాలకృష్ణని 10 సంవత్సరాల పాటు బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నట్లుగా కాపునాడు పేర్కొంది.


ఇక ఈ షరతులకు తెలుగుదేశం పార్టీ కనుక పోతే రాష్ట్రవ్యాప్తంగా నారా లోకేష్ పాదయాత్రని కాపు సామాజిక వర్గం అడ్డుకుంటుందని హెచ్చరిస్తున్నామంటూ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు. మరి ఈ విషయం మీద నందమూరి బాలకృష్ణ స్పందిస్తారా? లేక తెలుగుదేశం పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది చూడాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఏపీలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాపునాడు నుంచి వచ్చిన ఈ డిమాండ్ మీద ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: Oscar Nominations: ఆస్కార్ నామినేషన్ల అధికారిక ప్రకటన ఇవాళే, ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి


Also Read: Akkineni Fans: మీ అహంకార, కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook