Karan Johar Tried Committing Suicide: బాలీవుడ్ లో సెలబ్రిటీలు అందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళందరికీ కంటిమీద కునుకు లేకుండా చేసే కమల్ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేఆర్కేగా చెప్పుకునే ఆయన తనను తాను జర్నలిస్టుగా, నటుడిగా, దర్శకుడిగా ఇలా పలు విభిన్నమైన పనులు చేసే వ్యక్తిగా చెప్పుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు ఆయన తాజాగా ఒక సంచలన ఆరోపణ తెరమీదకు తీసుకొచ్చాడు. అదేమిటంటే కరణ్ జోహార్ సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా కేఆర్కే సంచలన ఆరోపణలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల అలియా భట్, రణబీర్ కపూర్ హీరో హీరోయిన్లుగా బ్రహ్మాస్త్ర అనే సినిమాని పలువురితో కలిసి కరణ్ జోహార్ నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలవడంతో కరణ్ జోహార్ దివాలా తీసే పరిస్థితికి వచ్చారని అందుకే ఆయన చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారని కేఆర్కే ఆరోపించారు. తర్వాత ఆ విషయం తెలిసిన ముఖేష్ అంబానీ ఆయనకు 300 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారని ఆయన కామెంట్ చేశారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కొన్నాళ్ల క్రితం కరణ్ జోహార్ తన ఇంట్లో సూసైడ్ చేసుకునేందుకు ఒక డ్రామా సృష్టించాడు అది కూడా బ్రహ్మాస్త్ర వలన కలిగిన నష్టం వల్ల అయితే ఈ విషయం తెలుసుకొని ముఖేష్ అంబానీ ఆయనకు 300 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే బ్రహ్మాస్త్ర సినిమాలో డబ్బులు పోగొట్టుకోవడం వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ చేశానని ఆయన ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు అని కమల్ ఆర్ ఖాన్ ప్రశ్నించాడు.


ఇక బ్రహ్మాస్త్ర సినిమా రిలీజ్ అయిన సమయంలో కూడా ఆ సినిమా కలెక్షన్స్ అన్ని ఫేక్ అని కావాలని హైప్ చేసే విధంగా కలెక్షన్స్ ప్రకటిస్తున్నారని కూడా కమల్ ఆర్ ఖాన్ కామెంట్స్ చేశారు. అలాగే ప్రతి సినిమాకి రివ్యూ చేసి తన రేటింగ్ ఇస్తూ ఉండే కమల్ ఆర్ ఖాన్ ఈ సినిమాకి మాత్రం రివ్యూ ఇవ్వకుండానే అసలు ఈ సినిమాకి ప్రేక్షకులు థియేటర్ల వరకు వెళ్లి చూస్తారని నమ్మకం నాకు లేదు అందుకే నేను రివ్యూ చేయడం లేదంటూ కామెంట్స్ చేశాడు.


అయితే ఇలాగే పలువురు నటుల మీద వివాదాస్పద వ్యాఖ్యలుచేస్తూ అనుచిత వార్తలు సృష్టిస్తూ ఉండే కమల్ ఆర్ ఖాన్ పలుసార్లు పరువు నష్టం దావా కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే అతని తీరు మారకపోవడం గమనార్హం.. మరి ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏమిటో కింద కామెంట్ చేయండి. 


Also Read: Bigg Boss Telugu: ఈ వారం బిగ్ బాస్ లో ఆసక్తికర ఎలిమినేషన్.. ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే?


Also Read: Koratala Siva: మీడియా టెన్షన్.. చివరి నిముషంలో ముఖం చాటేసిన కొరటాల శివ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook