Karate Kalyani vs Srikanth Reddy Issue: కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియో వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి, కరాటె కళ్యాణితో జీ తెలుగు న్యూస్ మాట్లాడింది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్‌లో జరిగింది ఏంటో, శ్రీకాంత్ రెడ్డి ఏం చేశాడో, కరాటే కళ్యాణికి అతడి నుంచి వచ్చిన ఇబ్బంది ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసిన జీ తెలుగు న్యూస్.. తాజా డిబేట్‌తో వారి అభిప్రాయాలను ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సెలబ్రిటిలు, స్నేహితులతో కలిసి స్క్రిప్ట్ ప్రకారం ప్రాంక్ వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో పోస్ట్ చేసే శ్రీకాంత్ రెడ్డి జీ న్యూస్ తెలుగు స్టూడియోకు వచ్చి తన ఆవేదనను వెలిబుచ్చగా.. ఫోన్ లైన్లో కరాటే కళ్యాణి సైతం తన వెర్షన్‌ని చెప్పుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరాటే కళ్యాణి నా ఇంటికొచ్చి మరీ నాపై దాడి చేసిందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. ఇప్పటికే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటో చెబుతూ కరాటే కళ్యాణి సైతం శ్రీకాంత్ రెడ్డిపై లైవ్ సాక్షిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఈ ఇద్దరి మధ్య జరిగింది ఏంటో తెలియాలంటే ఇదిగో ఈ మొత్తం ఎపిసోడ్‌ని వీక్షించాల్సిందే.


Also read : SVP First Day Collections: బాక్సాఫీస్‌పై మహేశ్‌ బాబు దండయాత్ర.. తొలిరోజు రికార్డు కలెక్షన్స్‌!


Also read : Samantha Hot Selfie: హాట్ హాట్‌గా సమంత.. ఒంటిపై కేవలం బాత్ టవల్‌తో సెల్ఫీ పోజు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook