Kareena Kapoor Khan demands Rs 12 crore for Sita's role: బాలీవుడ్ లో కొన్ని రోజులుగా సమానవేతన(Equal pay) నినాదం మార్మోగుతుంది. హీరోలతో సమానంగా తమకు పారితోషికం ఇవ్వాలని హీరోయిన్స్(Actresses) డిమాండ్ చేస్తున్నారు. దీనికి కొందరు నటీమణులు మద్దతు పలుకుతుంటే...మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హీరోలు ఫైట్స్ చేస్తారు.. డాన్సులు చేస్తారు.. ఇమేజ్‌తో సినిమాను నడిపిస్తుంటారు.. వాళ్ళతో సమానంగా తమకు కూడా అంతే పారితోషికం కావాలని కోరడం సమంజసం కాదంటూ కొందరు స్టార్ హీరోయిన్స్ బాహాటంగానే తమ అభిప్రాయం చెప్పారు. అయితే మరికొందరు మాత్రం దీనికి నో చెప్తున్నారు. హీరోలకు అంత ఇస్తున్నపుడు.. ఎందుకు హీరోయిన్లకు ఇవ్వరు అంటూ భీష్మించుకుని కూర్చున్నారు.


కంగనా రనౌత్, కరీనా కపూర్(Kareena Kapoor) లాంటి హీరోయిన్లు ఇందులో ముందు వరసలో ఉంటారు. హీరోలకు ఎంత ఇస్తున్నారో.. అంతే తమకు కూడా కావాలంటూ పట్టు పడుతున్నారు వాళ్లు. నిర్మాతలు ఈ విషయంలో తల పట్టుకుంటున్నారు. తాజాగా కరీనా కపూర్ మరోసారి ఈ విషయంపై ఓపెన్ అయింది. బాలీవుడ్‌(Bollywood)లో ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్‌తో పాటు రామాయణం(Ramayanam) ఆధారంగా రూపొందనున్న మరో సినిమాలో కరీనా కపూర్ నటించబోతుంది.


Also Read: Saidharam Tej Health Status: సాయిధరమ్ తేజ్ కాలర్ బోన్ సర్జరీ సక్సెస్, నిలకడగా ఆరోగ్యం


ఇందులో ప్రధానమైన సీత(Sita) పాత్రలో ఈమె నటించబోతున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇందులో నటించడానికి ఏకంగా 12 కోట్ల పారితోషికం అడుగుతుంది కరీనా కపూర్. నిర్మాత ఈ విషయంలో గుండెల్లో రాయిపడినట్లు అయ్యింది. అంత పారితోషికం ఏంట్రా బాబూ అంటూ ముక్కున వేలేసుకున్నాడు. అయితే దీనిపై ఇప్పుడు అసలు విషయాలు మాట్లాడుతుంది కరీనా.


ఈక్వల్ పే డిమాండ్..
ఈక్వల్ పే డిమాండ్‌ను ఆమె ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చింది. అంటే హీరో హీరోయిన్ అనే తేడా లేకుండా అందరికీ ఒకేలా పారితోషికం ఇవ్వడం అన్నమాట. స్త్రీ, పురుషులకు ఒకే వేతనం ఇవ్వాలంటూ కోరుతుంది కరీనా. ఇప్పుడు తాను కమిటైన రామాయణం సినిమాను సీత కోణంలో చెప్పాలనేది దర్శక నిర్మాతల ఆలోచన. అంటే సినిమాలో తనదే కదా ముఖ్య పాత్ర.


రాముడు ఉన్నా కూడా ప్రధాన పాత్రను మించిన ప్రధాన పాత్ర తనదే కదా అంటుంది బాలీవుడ్ భామ. అందుకే హీరోయిన్‌గా తనకు ఆ హక్కు ఉంది.. అందుకే 12 కోట్లు అడిగాను అంటుంది కరీనా కపూర్. ఈక్వల్ పే డిమాండ్ చేయడంలో తప్పేముందని కరీనా ప్రశ్నిస్తుంది. 12 కోట్ల పారితోషికం(remuneration) విషయంలో వెనక్కి తగ్గేదే లేదని చెప్పుకొచ్చింది కరీనా. బాలీవుడ్‌లో మరికొందరు హీరోయిన్లు కూడా ఇలాగే ఈక్వల్ పే డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook