Kareena Kapoor And Saif Ali Khan Blessed With A Baby Boy: బాలీవుడ్ బెబో కరీనా కపూర్ రెండోసారి తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం బాలీవుడ్ అగ్రహీరో సైఫ్ అలీ ఖాన్ భార్య, నటి కరీనా కపూర్ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవాబ్‌, కపూర్‌ల కుటుంబంలో మరో వారసుడు రావడంతో రెండు కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీనా కపూర్ గత ఏడాది ఆగస్టులో తాను గర్భం దాల్చినట్లు ప్రకటించగా.. గత కొన్ని రోజులుగా గర్భంతోనే సినిమా, యాడ్ షూటింగ్స్‌లో బెబో కరీనా కపూర్ పాల్గొంటోందని తెలిసిందే. ఈ క్రమంలో శనివారం సాయంత్రం నొప్పులు రావడంతో భార్య కరీనా కపూర్‌ను నటుడు సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) ముంబైలోనీ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. నేటి ఉదయం రెండో బిడ్డ(Kareena Kapoor Blessed With Baby Boy)కు ఆమె జన్మనిచ్చింది.


Also Read: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్


తొలి భార్య నుంచి విడాకులు తీసుకున్న సైఫ్ అలీ ఖాన్ 2012లో బాలీవుడ్(Bollywood) అగ్రనటి కరీనా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. కాగా, వీరికి 2016లో బాబు తైమూర్ అలీ ఖాన్ సంతానం ఉన్నాడు. తాజాగా కరీనా, సైఫ్ దంపతులకు రెండో సంతానంగా మరో బాబు జన్మించాడు. బాలీవుడ్ ప్రముఖులు సైఫ్, కరీనా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


అయితే సైఫ్ అలీ ఖాన్ నాలుగోసారి తండ్రి అయ్యాడు. తొలి భార్య అమృతా సింగ్ ద్వారా సంతానం సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఉన్నారు. కాగా, తొలి భార్య అమృతా సింగ్‌ నుంచి 2014లో విడాకులు తీసుకున్నాడు సైఫ్.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook