Japan Review: సర్దార్ సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకున్న హీరో ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అవతరించడానికి జపాన్ సినిమాతో వచ్చేసాడు. నేడు ఈ మూవీ థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయింది. మరి ఈ చిత్రం మొదటి షోలు ఆల్రెడీ థియేటర్స్ లో పడగా.. ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమాలో కార్తీ తన మేకోవర్, డైలాగ్ మాడ్యులేషన్‌తోనే జనాల మీద ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ దగ్గించుకుంది. కాగా సినిమా విడుదలయ్యాక మాత్రం ఇప్పుడు ఈ చిత్రంపై భిన్నభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


జపాన్ సినిమా గురించి ట్విట్టర్ లో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క లాగా ఉన్నాయి. ఒకరేమో జపాన్ సినిమా  క్రింజ్‌లా ఉందని, అట్టర్ ఫ్లాప్ అని అనగా, మరొకరేమో జపాన్ సూపర్ హిట్ అని, సక్సెస్ వైబ్స్ వచ్చాయని రివ్యూ పెట్టేసారు. 


 





మరి కొంతమంది ఏమో రాజ్ మురుగున్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కార్తీ  అద్భుతంగా నటించాడని, ఫస్ట్ హాఫ్ ఎబోవ్ యావరేజ్అని, సెకండాఫ్ బాగుందని చెబుతున్నారు. జీవీ ప్రకాష్ బీజీఎం నెక్ట్స్ లెవెల్ అని కామెంట్లు చేస్తున్నారు. విజువల్స్ అదుర్స్ అని అంటున్నారు.


 





మరో యూజర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది కార్తి వ‌న్ మ్యాన్ షో అని.. సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయ‌ని.. విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అని రివ్యూ పెట్టాడు..


మొత్తానికి రివ్యూలు అన్నీ చూస్తూ ఉంటే కార్తి ఈ సినిమాలో అద్భుతంగా నటించారని అర్థమవుతోంది. కాగా ఈ సినిమా హిట్టా లేక కేవలం యవరేజ్ గా మిగులుతుందా అనేది తెలియాలి అంటే మాత్రం మరి కొద్దిసేపు వేచి చూడాల్సిందే.


Also Read: ఆ టైంలో జరుగుంటే నా పరిస్థితి ఏమిటి.. డీప్ ఫేక్ వీడియో పైన స్పందించిన రష్మిక…


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి