Karthika Deepam 2: గుడ్ బై మై డియర్ మరదల.. దీప చావాలి, నువ్వు నాకు కావాలి బావ, జ్యోత్స్న చెంప చెల్లుమందిగా..
Karthika Deepam 2 Today December 21 Episode: తాతా మనవళ్ల సవాలు అప్పుడే దశరథ్ వెళ్తాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోతావా? అంటాడు. ఇక శివన్నారాయణ కూడా వాడు సొంత డబ్బులతో సొంత రెస్టారెంట్ పెడతా అన్నాడు. అందుకే అన్నీ వదిలేసి కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోతున్నాడు అంటాడు.
Karthika Deepam 2 Today December 21 Episode: రేయ్ కార్తీక్ మతి ఉండే ఈ నిర్ణయం తీసుకున్నావా? అంటాడు దశరాథ్.. ఇదంతా మీది మావయ్య అందుకే వదిలేసి వెళ్లిపోతున్నా.. అంటాడు. ఏంటి చెల్లెమ్మ ఇది మాది అంటే మీది కాదా? అంటాడు దశరథ్. ఈ విషయం చెప్పి పర్మిషన్ తీసుకోవడానికి తండ్రి గుర్తుకు రాలేడు. నేను వచ్చి అడ్డుపడినందుకు ఈ లోన్ కాగితాలు చినిగిపోయాయి కానీ, బజారులో పడేది నా పరువు అంటాడు శివన్నారాయణ.
నేనే వద్దానుకున్నప్పుడు ఈ లోన్ గురించి ఎందుకు అంటాడు కార్తీక్. క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు పాస్‌పోర్టులు అన్ని అప్పగించేస్తాడు. దశరథ్ కూడా వద్దు అని వారిస్తాడు అయినా వినకుండా కార్తీక్ అన్ని అప్పజెప్పేస్తాడు. డాడీ.. వద్దని చెప్పు డాడీ బావను వెళ్లోద్దను అంటుంది జ్యోత్స్న. ఇలా వెళ్లిపోతే ఇంటి పరువు ఏమవుతుంది? అంటాడు దశరథ్. వీడు వంట మనిషి మెడలో తాళి కట్టినప్పుడే పోయింది రా పరువు అంటాడు శివన్నారాయణ. ఇది కరెక్టు కాదు నాన్న అంటాడు దశరథ్. దీప ఎక్కువ కదా.. పోనీ ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అంటాడు తాత.
చెల్లెమ్మ బయటకు వెళితే నాన్నకు చెడ్డపేరు మనకు కూడా చెడ్డపేరు అంటాడు దశరథ్. తన చేతికి ఉన్న పుట్టింటి గాజులను కూడా ఏడుస్తూ ఇచ్చేస్తుంది. మెడలో ఉన్న బంగారు గొలుసులు, ఉంగరాలు అన్నీ తీసి ఇచ్చేస్తుంది ఏడుస్తూ కాంచన. మేం కొనుకున్నా కూడా నాన్న డబ్బులే కదా అని ఏడుస్తూ చెవికి ఉన్న కమ్మలను అప్పజెప్పుతుంది. నాన్న.. మీరు నాకు పెట్టిన బంగారం అంతా బీరువాలో ఉంది. ఒంటి మీద కేవలం ఈ తాళి కూడా మీరు ఇచ్చిందే. దీన్ని కూడా తీసి ఇచ్చేమంటావా? నాన్న అని ఏడుస్తుంది కాంచన.. భర్త బతికి ఉండగా తాళి తీయకూడదు నాన్న. నాన్న.. ఈ ఒక్కటి ఉంచుకోనా? అని ఏడుస్తుంది. చెల్లమ్మ ఆ తాళి నీ మెడలో ఉండని అమ్మ అంటుంది అనసూయ.
ఇదీ చదవండి: శ్రీతేజ్ ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. హెల్త్ బులెటిన్ విడుదల, డాక్టర్లు ఏం చెప్పారంటే?
నాన్న మాట్లాడట్లే నా కొడుకు డబ్బులు సంపాదించగానే పంపిచేస్తా అంటుంది. చెల్లెమ్మ..నావల్ల కావాట్టేదు, మీరు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు, వీల్లేదు అని దశరథ్ కూడా ఏడుస్తాడు. నాన్న.. చెల్లెలిని ఎక్కడికీ వెళ్లొద్దని చెప్పు నాన్న.. అంటాడు దశరథ్. నేను వారి దృష్టిలో బతికిలేనురా, వంట మనిషికోసం వెళ్తున్నాడు. సవాళు విసిరింది వాడు. నా మీద గెలవడానికి ఉన్నదంతా వదిలి వెళ్లిపోతున్నాడు పోనీ దశరథా.. అంటాడు శివన్నారాయణ.
అన్ని వదిలేశాం తాత... మేం కట్టుబట్టలతో మాకు సొంతమైన వాటిని మాత్రమే తీసుకువెళ్తున్నాం అంటాడు కార్తీక్. ఇక బెడ్‌రూంలో పడుకున్న రౌడీని లేపుతాడు కార్తీక్. బయటకు వెళ్తున్నాం బ్యాగ్ తగిలించుకోఅంటాడు. బయట తాతా అందరూ ఉన్నారు. ఏంటీ అని అడకకూడదు. రౌడీ నీకు సంబంధించినవి ఉన్నాయా? అంటాడు. లేదు నువ్వు ఉన్నావుకదా అంటుంది రౌడీ. కబోర్డులో లాకెట్ తీసుకుంటాడు. మళ్లీ మనం ఎప్పుడు వస్తాం అంటుంది. అవార్డు తీసుకున్న తర్వాత అంటాడు.
ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? దీప అంటుంది జ్యోత్స్న. నువ్వు ఒక దరిద్రానివి నీతో ఉంటే ఎవరికైనా దరిద్రమే అంటుంది. ఇవి నా కూతురి మందులు, స్కూల్ బ్యాగ్స్ కావాలంటే చెక్ చేసుకో అంటాడు కార్తీక్. ఈ పొగరు ఉంటే నువ్వు ఎక్కడ నెగ్గలేవు అంటాడు తాత. శౌర్య అందరినీ పలకరిస్తుంది. రా.. దీప అని చేయి పట్టుకుని వెళ్తుంటాడు. మరోసారి తప్పు చేస్తున్నావు బావ అంటుంది జ్యోత్స్న. నా విజయం ఎంత గొప్పగా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. గుడ్ బై మైడియర్ మరదలా.. అన్ని చెప్పి ఇంట్లో నుంచి అందరూ వెళ్లిపోతారు.
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టెంపో నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు..
నువ్వు ఎక్కడికీ వెళ్లినా నిన్ను వదలను బావా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు బయటకు వెళ్తేనే నీకు తెలుస్తుంది. నాన్న.. మన కార్ అక్కడ ఉంది నాన్న అంటుంది రౌడీ. ఈ ఇంటితో రుణం తీరిపోయింది అంటుంది కాంచన. మనల్ని కాదనుకున్నప్పుడు మనం కూడా కొన్ని వదులుకోవాలి అంటాడు కార్తీక్. దశరథ్ ఏడుస్తుంటాడు. శవన్నారాయణ ఇంటి వారసులు అనాథలా మొగుడ్ని తీసుకుని వెళ్లిపోతుంది. ఏం కర్మనే నీది నువ్వు చావాలి.. నాకు బావ కావాలి ఎక్కడ ఉన్న వెంటాడుతూనే అంటుంది జ్యోత్స్న.
ఇక సుమిత్ర ఏం జరిగింది? అని దశరథ్‌ను అడుగుతాడు. కార్తీక్ కట్టుబట్టలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు సుమిత్ర అంటాడు. ఎవరైనా కావాలని ఎందుకు పొమ్మంటారు. ఆ వంటమనిషి దీప కోసం బావ తనంతట తానే వెళ్లిపోయాడు అంటుంది జ్యోత్స్న. చెంప చెల్లుమనిస్తుంది సుమిత్ర.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook