Karthika Deepam 2: గళ్లచొక్క, లుంగీలో కార్తీక్.. సీఈఓ నుంచి టిఫిన్ బండి సర్వర్..
Karthika Deepam 2 Today December 30 Episode: దీప టిఫిన్ సెంటర్ పెట్టడం ప్రారంభమవుతుంది. అందరి సమక్షంలో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తుంది. టిఫిన్ సెంటర్ పేరు కార్తీక్ టిఫిన్ సెంటర్ అని పెడుతుంది. ఆల్ ది బెస్ట్ అక్క బావ పేరుపై పెట్టిన ఈ టిఫిన్ సెంటర్ రెస్టారెంట్‌గా పెద్దగా ఎదగాలి అంటాడు కాశీ..
Karthika Deepam 2 Today December 30 Episode: ఇక దీప ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సంతోషంలో ఉండాల్సిన టైమ్‌లో ముఖంలో దిగాలెందుకు అంటాడు దాసు. బావ కూడా వచ్చి ఉంటే బాగుండు అంటాడు కాశి. మేం పిలుస్తాం అని శౌర్య, కాశిలు అంటారు. వద్దులే ఇబ్బంది పెట్టొద్దు అంటుంది. కార్తీక్ వాటర్ డెలివరీ బాయ్‌లా రెడీ అయి ఎంట్రీ ఇస్తాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టి చూస్తారు. అన్నయ్యేనే అంటుంది కార్తీక్ చెల్లి. కార్తీక్ బాబు మీరేంటి ఇలా వచ్చారు అంటుంది దీప.
బావ నువ్వు సూపర్ బావ అంటాడు కాశి. మీరంతా ఒక మంచి పని చేస్తుంటే నేను ఎందుకు కాదంటాను. దండం మీద లుంగి, నువ్వు నాకోసం తెచ్చిన గళ్ల చొక్క వేసుకున్నా వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాఅంటాడు. వచ్చినందుకు థ్యాంక్స్ బాబు.. అంటుంది దీప. సరే నువ్వు పూరీ వెయి నేను ఇడ్లి వేస్తా అంటాడు కార్తీక్. ఈపనులు మీకెందుకు వెళ్లి కూర్చొండి అంటుంది దీప. మన టిఫిన్ సెంటర్‌లో మనం పనిచేసుకుంటాం. దీంట్లో ఎటువంటి నామూషీ లేదు అంటాడు. టిఫిన్ రెడీ అయిపోతుంది. అమ్మను ముందుగా బోణీ చేయమంటాడు. మీ తాత కూడా ఇలాగే చిన్న టిఫిన్ సెంటర్‌తో స్టార్ట్ చేశాడు అంటుంది కాంచన. ఇక అందరికీ టిఫిన్ ఇస్తాడు. సూపర్ అంటారు. కార్తీక్ బాబు మీరు కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అంటుంది దీప. నీచేతికి ఎవరు వంక పెడతారు అంటాడు కార్తీక్.
టిఫిన్లు చాలా బాగున్నాయమ్మ అంటాడు దాసు. అక్క ఈ హ్యాపీ మూమెంట్‌లో పడి ఫోటోస్ దిగడం మర్చిపోయాం అందరూ సెల్ఫీ తీసుకుంటారు. అప్పుడే మొదటి కస్టమర్ వస్తాడు. అమ్మ ప్లేట్ పూరీ ఇవ్వు అంటాడు.వెంటనే తెచ్చి ఇస్తుంది. జ్యోత్స్న గ్రూప్‌కు నువ్వే ఓనర్‌వు మళ్లి మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నావ్ నీకు ఏ అడ్డు రాకూడదమ్మ అని మనసులో అనుకుంటాడు దాసు.
జ్యోత్స్నకు వాళ్లు దిగిన సెల్ఫీఫోటో పెడతాడు కాశి. దీప మీ బావ కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాడు. మీ బావ చూడు లుంగీ కట్టుకుని ఎలా నిలబడ్డాడు అంటుంది పారిజాతం. దీప హోటల్‌లో టిఫిన్ చేద్దాం పద గ్రానీ ఆకలి వేస్తుంది. నేను కూడా రంగంలోకి దిగుతా అంటుంది పారిజాతం. ఇక గిరాకీ పెరిగిపోతుంది. మీరిద్దరూ కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది కానీ, నిన్ను ఇలా చూడటం బాగలేదురా అంటుంది కాంచన. అప్పుడే జ్యోత్స్న కార్ వచ్చి ఆగుతుంది. దీప వాళ్లను చూసి షాకవుతుంది. కార్తీక్ బాబు ఒకసారి అటు చూడండి అంటుంది. వీళ్లిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటాడు దాసు, నేనే ఫోటో పంపా అంటాడు కాశి. నువ్వెప్పుడూ ఇంతే అంటాడు దాసు.
ఇదీ చదవండి: అసలు విషయం తేల్చేసిన రుద్రాణీ.. అప్పుకు కూడా, మళ్లీ సర్వరోగ నివారిణిలా కావ్య..
గళ్ల లుంగీ షార్ట్ అదిరిపోయింది బావ. కానీ, ఇలా చీప్‌గా టిఫిన్ సెంటర్ పెడతావు అనుకోలేదు బావ అంటుంది జో. పక్కన ఉన్న మనిషి అలాంటిది కార్తీక్ పేరుతో ఆ దీపే పెట్టి ఉంటుందిఅంటుంది పారిజాతం. సీఈఓ స్థాయి నుంచి రోడ్డుపై టిఫిన్ సెంటర్ దీనంతటికీ కారణం దీపను పెళ్లి చేసుకోవడం అంటుంది. కస్టమర్లలా వస్తే టిఫిన్ తినడానికి వస్తే సైలెంట్‌గా తినివెళ్లండి అంటాడు కాశి. శుభమా.. అని టిఫిన్ సెంటర్ పెట్టారు అల్లరి చేయకు అంటాడుదాసు.
ఏం పారూ కారం పొడి వేసి ఇడ్లి ఇవ్వనా అంటాడు కార్తీక్. ఇద్దరికీ టిఫిన్స్ తెచ్చి ఇస్తారు. చట్నీ అదిరిపోయిందని టాక్ కొంచెం వేసుకోండి అంటాడు కార్తీక్. జో లేచి నువ్వు ఇలా ఉండటం నాకు నచ్చలేదు బావ. ఇందుకేనా అందరినీ, అన్నిటినీ వదిలేశావు అంటుంది. నా బావను జీవితంలో ఇలా చూస్తాను అనుకోలేదు అంటుంది. రెస్టారెంట్‌లో పార్ట్నర్‌గా ఉన్నవాడిని టిఫిన్ బండిపై సర్వర్‌నుచేశావు ఏం సాధించావు దీప, ఇదేనా నువ్వు కోరుకున్నది అంటుంది జో. ఇంతకంటే దిగజారడానికి ఏం లేకుండా చేశావు. ఇదంతా నీస్వార్థం కోసం అంటుంది ఇంక ఇక్కడే ఎందుకు ఉన్నావ్ వెళ్లు అంటాడు. ఇక్కడ ఉండటానికి కాదురా నాలుగు ఫోటోలు తీసుకుంటా అని పారు ఫోటోలు తీస్తుంది. తీసుక అని కార్తీక్ ఫోజులు పెడతాడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదో చేస్తా అన్నావు, ఇప్పుడు ఏం చప్పుడు చేయట్లేదు అంటుంది జో తో పారిజాతం. ఒక్కసారి బావ కళ్లలో ఆనందం చూడు అది చూశాక ఏం చేయాలనిపిస్తుంది అంటుంది జ్యోత్స్న.
ఇదీ చదవండి: ఫుల్‌గా తాగేశావా పాప..? కారులో శ్రీలీల రచ్చరంబోలా వీడియో వైరల్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter