Nikhil's Karthikeya 2 movie Trailer 2 released: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కార్తికేయ 2'. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2014లో విడుదలైన కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. అయితే మొదటి భాగంలో స్వాతి హీరోయిన్ గా నటించగా ఈ సినిమాలో నిఖిల్‌కు జోడీగా కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. 'కార్తికేయ 2 నుంచి ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, సహా టీజర్లు, ఒక ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక జులై 22న విడుదల కావలసిన సినిమా అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 13న విడుదల కానున్న నేపథ్యంలో నేడు చిత్ర యూనిట్ సినిమా నుంచి రెండో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ను రవితేజ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. రెండు నిముషాల ఎనిమిది సెకన్ల నిడివిగల ఈ వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం, ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం .. అంటూ సాగిన డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి.



మొక్కు అంటే ఋణం, శేషం ఉంచకూడదు అని చెబుతూ ఒక స్వామీజీ నిఖిల్ తల్లిని ద్వారకకు వెళ్లమని పంపిస్తారు. అలా వెళ్లిన నిఖిల్ అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే విషయాన్నీ చూపారు. అలాగే అద్భుతమైన విజువల్స్, ఒళ్ళు గగుర్పొడిచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక కార్తికేయ 2 సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు.


ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతను అనే ఒక నెగటివ్ పాత్రలో ఆదిత్య మీనన్ నటిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టిజి విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 13న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. 


Also Read: Kalyan Ram: మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అయితే మరి చిరంజీవి ఎవరు?


Also Read: Kalyan Ram: ఈ విజయం మాది కాదు.. యావత్ తెలుగు సినీ పరిశ్రమది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook