Karthikeya2 8 Days Collections: నిఖిల్ హీరోగా 2014 సంవత్సరంలో విడుదలైన కార్తికేయ సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ ప్రకటించారు. ఆ సీక్వెల్ ను ప్రకటించిన విధంగా రూపొందించి విడుదల చేయాలని ప్రయత్నించారు కానీ సినిమా ధియేటర్ల ఇష్యూ కావడంతో అనేక వాయిదాల తర్వాత ఆగస్టు 13వ తేదీ విడుదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా మీద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ఎనిమిది రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు మూడున్నర కోట్లు, రెండో రోజు మూడు కోట్లు 81 లక్షలు, మూడవరోజు నాలుగు కోట్ల 23 లక్షలు, నాలుగో రోజు రెండు కోట్ల పదిహేను లక్షలు, ఐదో రోజు కోటి 20 లక్షలు, ఆరవ రోజు కోటి 34 లక్షలు, ఏడవ రోజు రెండు కోట్ల మూడు లక్షలు, ఎనిమిదవ రోజు కోటి 82 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది.


అలా తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది రోజులకు గాను 20 కోట్ల 51 లక్షల షేర్ 32 కోట్ల 55 లక్షల గ్రాస్ వసూలు చేసింది.  ఇక అదే విధంగా మిగతా ప్రాంతాల్లో కోటి 85 లక్షలు, ఓవర్సీస్ లో మూడు కోట్ల 90 లక్షలు, నార్త్ ఇండియాలో తెలుగు సహా హిందీ మినహాయించి మిగతా భాషలు అన్నీ కలిపి ఐదు కోట్ల 60 లక్షల వసూళ్లు సాధించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 31 కోట్ల 86 లక్షల షేర్ వసూళ్లు, 58 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 18 కోట్ల 56 లక్షల లాభాలతో దూసుకు వెళుతుంది.


Karthikeya2 8 Days Hindi Collections: అయితే నార్త్ బెల్ట్ లో మాత్రం ఈ సినిమా దుమ్ము దులుపుతోంది. మొదటి రోజు కేవలం 50 స్క్రీన్ లతో థియేట్రికల్ రన్ ప్రారంభించిన ఈ సినిమా రెండో రోజు నుంచి స్క్రీన్లు పెరగడంతో వసూళ్లు కూడా భారీగా నమోదవుతున్నాయి. రెండో రోజు 28 లక్షలు, మూడవ రోజు కోటి పది లక్షలు, నాలుగో రోజు కోటి 28 లక్షలు, ఐదో రోజు కోటి 38 లక్షలు, ఆరవ రోజు కోటి 64 లక్షలు వసూళ్లు సాధించింది. ఇక జన్మాష్టమి సందర్భంగా భారీ ఎత్తున స్క్రీన్లు పెంచడంతో ఏడవ రోజు రెండు కోట్ల 46 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా ఎనిమిదో రోజు శనివారం కలిసి రావడంతో దాదాపు మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు వసూళ్లు కేవలం హిందీ వెర్షన్ లోనే సాధించింది. అలా మొత్తంగా 11 కోట్ల 25 లక్షల నెట్ వసూళ్లను ఈ సినిమా సాధించినట్లయింది.


Also Read: Jr NTR Amit Shah Meeting: ఆ సినిమా చేయనన్న ఎన్టీఆర్.. అందుకే 'అమిత్ షా' నుంచి పిలుపు?


Also Read: RGV Tweet on Karthikeya 2: ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 కంటే 'కార్తికేయ 2' పెద్ద హిట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి