Sridevi Drama Company Promo బుల్లితెరపై టీఆర్పీల కోసం చేసే స్టంట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎపిసోడ్‌లో ఏమీ ఉండకపోయినా ప్రోమోలో మాత్రం ఎంతో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు. అలా ప్రోమోలను క్రియేట్ చేయడంలోనూ టాలెంట్ అవసరమే అని అంటుంటారు జనాలు. అయితే ఒక్కోసారి ఆ టాలెంట్ పీక్స్‌కు వెళ్తుంటుంది. చూసే జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తుంది. మల్లెమాల టీంలో వస్తోన్న షోలు ఇలా టీఆర్పీ స్టంట్లుగానే మిగిలిపోయాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్ని షోల ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎపిసోడ్‌లో ఏదో కొట్లాట జరుగబోతోన్నట్టుగా చూపిస్తారు. తీరా ఎపిసోడ్ చూస్తే అందులో ఏమీ ఉండదు. కన్నీరుమున్నీరవుతున్నట్టుగా చూపిస్తారు. గుండెబద్దలై స్టేజ్ మీద పడి చచ్చిపోతోన్నట్టుగా చూపిస్తారు. కానీ ఎపిసోడ్‌లో మాత్రం అంత ఎమోషన్ ఏమీ ఉండదు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ప్రతీ ఒక్కరూ ఇప్పుడు పర్ఫామెన్స్ ఇస్తున్నారట.. ఆస్కార్ లెవెల్లో నటించేస్తున్నారట. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోను జనాలే ఏసేసుకుంటున్నారు. మల్లెమాల టీం, శ్రీదేవీ డ్రామా కంపెనీ టీంను నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.


 



ఈ ప్రోమోలో ఏముందంటే.. ఓ బాస్కెట్‌ బాల్‌ను పట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎవరైతే ముందుగా పట్టుకుని రష్మీ చేతికి ఇస్తారో.. వారికి ఓ బంపర్ ఆఫర్ వస్తుంది. అవతలి వ్యక్తిని కొట్టడం, డ్యాన్స్ చేయడం ఇలా ఏదో ఒకటి ఆప్షన్‌గా వస్తుంది. దీంతో కరుణ, భావన మధ్య పోటీ ఉంటే.. భావన గెలుస్తుంది. కరుణను కొడతాను అంటూ.. భావన అనేసింది.


పాత విషయాలను మనుసులో పెట్టుకుని ఇలా ఇక్కడ ఈ షోలో పగ తీర్చుకోవడం బాగా లేదు అని కరుణ అంటుంది. అయినా వినని భావన.. కరుణను చాచి కొట్టేసింది. కరుణ చెంపను భావన పగలగొట్టేసింది. అంత గట్టిగా కొట్టడం కరెక్ట్ కాదని ఆది కూడా వారించాడు. ఇక పవిత్ర జుట్టును ఎవరో కట్ చేశారంటూ ఆది గమనించాడు. పరదేశీ కట్ చేసి ఉంటాడని పవిత్ర ఫైర్ అయింది. ఇక ఇలా ఈ ప్రోమోలో టీఆర్పీ స్ట్రాటజీలను బాగానే వాడినట్టు కనిపిస్తోంది.


ఈ ప్రోమో మీద జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఇంకా ఎన్ని రోజులు జనాలను ఎర్రోళ్లు చేస్తారు అంటూ మండి పడ్డారు. ఏ ముహుర్తానా శ్రీదేవీ డ్రామా కంపెనీ అని పెట్టారో గానీ అందరూ డ్రామాలు బాగానే చేస్తున్నారు అని ఫైర్ అవుతున్నారు.


Also Read:  Taraka Ratna Death Live Updates: 'మోకిల' నివాసానికి చేరుకున్న తారకరత్న భౌతికకాయం..భోరున విలపిస్తున్న నందమూరి కుటుంబం


Also Read: Taraka Ratna Siva Devotee: శివుని భక్తునిగా నటించి శివరాత్రి రోజే శివైక్యం.. శివుని ఆన లేనిదే చీమైనా కుట్టునా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook