Gruhalakshmi Kasthuri : ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు!.. ముస్లింలు చేస్తే నేరం కాదు కానీ.. గృహలక్ష్మీ కస్తూరి
Gruhalakshmi Kasthuri on Bigamy గృహలక్మీ సీరియల్‌తో ఇప్పుడు బుల్లితెరపై కస్తూరీ శంకర్‌కు మంచి ఇమేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో కస్తూరీ శంకర్ వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.
Gruhalakshmi Kasthuri on Bigamy నారి నారి నడము మురారి, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడు వంటి టైటిల్స్ వింటే మనకు ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో గుర్తుకు వస్తారు. ఇక ఇప్పుడు మహారాష్ట్రలో ఇదే టైపులో ఓ వివాహాం జరిగింది. కవలిలిద్దరూ కూడా ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడ్డారు. ఇష్టప్రకారమే ఇద్దరూ కలిసి ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇది చట్ట ప్రకారం నేరం కావడంతో పోలీసులు, మహిళా కమిషన్ వారు విచారణకు సిద్దమయ్యారట. దీనిపై కస్తూరీ శంకర్ ట్వీట్ వేసింది.
ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం భార్య బ్రతికుండగానే మరో పెళ్లి చేసుకోవడం నేరం. కానీ డిసెంబర్ 2న కవలిలిద్దరినీ ఓ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడంటూ పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనిపై విచారణ చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. మరో వైపు మహిళా కమిషన్ కూడా ఈ విషయం మీద విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై కస్తూరీ శంకర్ తాజాగా వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో కవలలు ఇద్దరూ కూడా ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.. నేను లాయర్ కాబట్టి.. ఇలాంటి పెళ్లి నేరమని చెబుతాను. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది నేరం కానీ ముస్లింలకు ఇది వర్తించదు. ఇక వ్యక్తిగతంగా మాట్లాడితే.. అభిప్రాయం చెప్పమంటే మాత్రం.. ఇది పూర్తి అంగీకారంతో జరిగింది.. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు.. ఇంకా మరెందుకు ఇదంతా? వారిని సంతోషంగా బతకనివ్వండి అంటూ ట్వీట్ వేసింది.
గృహలక్ష్మీ సీరియల్‌లో తులసిగా నటించిన కస్తూరీ.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. పొలిటికల్ అనలిస్ట్, క్రికెట్ అనాలిసిస్, సోషల్ యాక్టివిస్ట్ ఇలా పలు రకాలుగా సోషల్ మీడియాలో స్పందిస్తూనే ఉంటుంది. ఇక స్వతాహాగా కస్తూరీ న్యాయవాది కావడంతో సమాజంలోని ప్రతీ సంఘటన మీద స్పందిస్తూ తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది.
Also Read : Harish Shankar : కుడిదిలో పడ్డ ఎలుకలా హరీష్ శంకర్?.. పవన్ ప్రాజెక్ట్ ఉందా? లేదా?.. డైలామాలో డైరెక్టర్
Also Read : Anasuya Bharadwaj : నన్ను నమ్మండి.. డబ్బుల కోసం నేను అవి చేయను.. అనసూయ కామెంట్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook