Kasthuri Shankar Slams : ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లిపై ట్రోలింగ్.. డబ్బులతో అన్నీ కొనలేమన్న కస్తూరీ శంకర్
Kasthuri Shankar Slams కస్తూరీ శంకర్ తాజాగా ఓ నెటిజన్ మీద విరుచుకపడింది. ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుకల మీద నెగెటివ్ కామెంట్లు చేశాడు. దీంతో కస్తూరీ శంకర్ తన టెంపర్‌ను కోల్పోయింది. మీకు ఇదే పనా? అందరినీ ట్రోలింగ్ చేస్తూ ఉంటారా? అని మండి పడింది.
Kasthuri Shankar Slams కస్తూరీ శంకర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సోషల్ యాక్టివిస్ట్‌గా, లాయర్‌గా, పొలిటికల్ అనలిస్ట్‌గా, క్రికెట్ అనలిస్ట్‌గా ఆమె చేసే కామెంట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. ఇక నెట్టింట్లో తన మీద జరిగే ట్రోలింగ్ పట్ల ఎక్కువగా రియాక్ట్ అవుతుంటుంది. సెలెబ్రిటీల మీద జరిగే ట్రోలింగ్ మీద కూడా కస్తూరీ శంకర్ ఘాటుగా స్పందిస్తుంటుంది.
తాజాగా ముఖేష్ అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకల మీద ఓ నెటిజన్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నిన్న అంతా కూడా ఆకాశ్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి వేడుకలే ట్రెండ్ అయ్యాయి. అంబానీ కుటుంబ సభ్యుల ఆటపాటలు, లగ్జరీ ఈవెంట్లు, వారి పెట్, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆకాశ్ అంబానీ మీద ఓ నెటిజన్ పిచ్చి వ్యాఖ్యలు చేశాడు. దీనిపై కస్తూరీ శంకర్ స్పందించాడు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఇలా అసూయపడే వ్యక్తులే ఉన్నారా? ఓ కుటుంబం ఇలా సంతోషంగా గడుపుతూ ఉంటే, ఓ మనిషిని ఇలా బాడీ షేమింగ్ చేయడం, వారి సంపద గురించి మాట్లాడటం చూస్తుంటే అలానే అనిపిస్తోంది, డబ్బుతో అన్నీ కొనలేం అది నిజమే. అందుకే మీరు వారికి ఇలా ఉచితంగా ద్వేషాన్ని ఇస్తున్నారా. ఇలా ఎందుకు పదే పదే చేస్తుంటారు.. వెళ్లి ఆ భారత్ చోడో యాత్రలో చేరండి అని కౌంటర్ వేసింది.
కస్తూరీ శంకర్ ఇప్పుడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. గృహలక్ష్మీ సీరియల్‌తో తులసి పాత్రలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ టాప్ ప్లేసులో దూసుకుపోతోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాలంటూ కూడా కస్తూరీ శంకర్ ఫుల్ బిజీగా ఉంటోంది.
Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook