హైదరాబాద్: సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టులు పోస్ట్ చేసిన నేరం కింద ఇటీవలే అరెస్ట్ అయిన కత్తి మహేశ్‌ను ( Kathi Mahesh), మరో కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ( Cybercrime cops ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కరోనాను, రాముడితో ముడిపెడుతూ సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్ట్ చేశారని కత్తి మహేష్‌పై హిందూ సంఘాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 14వ తేదీనే సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. Also read : Rat caused fire accident: ఆఫీసుకు నిప్పు పెట్టిన ఎలుక.. కోటి రూపాయల నష్టం


రాముడిపై ( Lord Sriram ) వివాదాస్పద పోస్ట్ పెట్టిన కేసులో నాంపల్లి కోర్టు 14 రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి జైల్లోనే ఉన్న కత్తి మహేష్‌ను తాజాగా పీటీ వారెంట్‌పై ( PT Warrant ) మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈసారి జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరు పరిచామని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. Also read : Jobs in ECIL: బీటెక్ పాసయ్యారా ? ఈ జాబ్ నోటిఫికేషన్ చూడండి