Katrina Kaif Vicky Kaushal wedding : విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల పెళ్లికి వచ్చే వాళ్లు తక్కువే.. మొబైల్స్ వద్దన్నారంట
Katrina Kaif, Vicky Kaushal`s wedding Updates : ఇవ్వాల్టి నుంచి రెండు రోజులత పాటు రాజస్థాన్‌లో విక్కీ కౌశల్.. కత్రినా కైఫ్‌ల వివాహ వేడుకలు జరగనున్నాయి. 9న విక్కీ, కత్రినాల పెళ్లి జరగనుంది. ఇవాళ వధూవరుల కుటుంబ సభ్యులు కోటలోకి చెకిన్ అయ్యారు. 11న వీరు చెక్ అవుట్ అవుతారు.
Katrina Kaif and Vicky Kaushal's wedding Updates Guest List Revealed: బాలీవుడ్‌లో ఇప్పుడు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల పెళ్లి.. హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ జంట పెద్ద హంగామా లేకుండా పెళ్లి వేడుకు జరుపుకోవాలని డిసైడ్ అయినట్లుంది. వీరి పెళ్లి రాజస్థాన్‌లో సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో జరగనుంది.
ఇవ్వాల్టి నుంచి రెండు రోజులత పాటు రాజస్థాన్‌లో (Rajasthan) విక్కీ కౌశల్ (Vicky Kaushal).. కత్రినా కైఫ్‌ల వివాహ వేడుకలు జరగనున్నాయి. 9న విక్కీ, కత్రినాల పెళ్లి జరగనుంది. ఇవాళ వధూవరుల కుటుంబ సభ్యులు కోటలోకి చెకిన్ అయ్యారు. 11న వీరు చెక్ అవుట్ అవుతారని సమాచారం.
దాదాపు నూట ఇరవై మందికి పైగా అతిథిలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల (Katrina Kaif) పెళ్లి వేడుకలో పాల్గొంటారని సమాచారం. ఇక ఈ పెళ్లి వేడుకలో కరోనా నిబంధనలను (Corona rules) స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నారు. వేడుకకు హాజరయ్యేవారంతా కూడా రెండు డోసుల వ్యాక్సినేషన్ (Vaccination) పూర్తి చేసుకుని ఉండాలి. లేదంటే ఆర్‌టీపీసీఆర్ నెగటివ్ రిపోర్ట్ అయినా తీసుకుని రావాలి.
ఇక విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల పెళ్లి వేడుకకు (Katrina Kaif and Vicky Kaushal's wedding) సంబంధించిన వీడియోలను రికార్డు చేసి.. పెళ్లికొచ్చిన అతిథుల అభిప్రాయాలతో ఒక ఫుల్ వీడియోను తమ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తామంటూ విక్కీ, కత్రినాలను సంప్రదించారట. ఇందుకుగాను భారీ మొత్తంలో ఆఫర్ చేసిందట సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్. దీంతో పెళ్లికి వచ్చే వారు.. మొబైల్స్‌లో తమ ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేయొద్దంటూ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ విన్నవించుకున్నారట. ఇక అతిథుల కోసం ఫుల్ సెక్యూరిటీ కల్పించారు.
Also Read : ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల పెళ్లి వేడుకకు వెళ్లే అతిథుల్లో ఆలియా భట్, కబీర్ ఖాన్, కరణ్ జోహార్, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్ ధావన్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు వీరి పెళ్లి వేడుకకు చేరుకుంటున్నారు. కబీర్ ఖాన్, నేహా ధూపియా ఇప్పటికే వెళ్లారు. సన్నీ కౌశల్ గర్ల్ ఫ్రెండ్ శర్వరీ వాగ్ జైపూర్ కు (Jaipur) చేరుకుంది. అయితే సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్‌లకు ఆహ్వానం అందలేదు అని టాక్.
Also Read : Pushpa Trailer: పుష్ప ట్రైలర్ బాగా నిరాశపరిచింది.. అబ్బే ఊహించినంతగా లేదబ్బా!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook