Katrina Kaif: అత్తగారింట్లో తొలిసారి వంట వండిన కత్రినా..ఏం చేసిందో తెలుసా?
Katrina Kaif: పంజాబీ కోడలిగా అత్తగారింట్లో అడుగుపెట్టిన కత్రినా కైఫ్..తన చేత్తో తొలిసారి హల్వాను చేసింది.
Katrina Kaif: ఇటీవల రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం(Katrina-Vicky Wedding) జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ జంట ఏది చేసినా వైరల్(Viral)గా మారుతోంది. పెళ్లి తర్వాత అత్తగారింట్లో వధువు తొలిసారిగా తన చేత్తో ఏదైనా తీపి వంటకం చేసే సాంప్రదాయం ఉంది. చౌంక చరదానా(chaunka chardhana) అనే ఈ అచారాన్ని పెళ్లయిన రెండు రోజుల తర్వాత నిర్వహిస్తారు. పంజాబీ కోడలిగా అడుగుపెట్టినా కత్రినా..ఈ ఆచారాన్ని పాటించింది.
Also Read: Katrina-Vicky Wedding: సల్మాన్, రణ్‌బీర్ నుంచి కత్రినాకు కాస్టలీ గిప్ట్స్...అవేంటో తెలుసా?
తొలిసారిగా కత్రినా హల్వా(halwa) వండింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్ స్టా(Instagram)లో షేర్ చేస్తూ..'మైనే బనాయా(నేను చేశాను)' అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ అయినా చక్కగా సాంప్రదాయాలను పాటిస్తుందంటూ..కత్రినాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook