Keerthi Suresh to replace krithi Shetty in Sharwanand New Movie: టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ను వరస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. ఇటీవల శర్వా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఎన్నో అంచాల మధ్య విడుదలై బాక్సాఫీక్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీలో శర్వానంద్‌కు జోడిగా రష్మిక నటించగా.. సీనియన్‌ హీరోయిన్లు రాధిక శరత్‌ కుమార్‌, ఖుష్బూ సుందర్‌, ఊర్వశిలు ముఖ్య పాత్రల్లో కనిపించప్పటికీ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలని ప్రముఖ దర్శకుడు కృష్ణ చైతన్య కథకు శర్వా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శర్వానంద్‌ కోసం కృష్ణ చైతన్య సరికొత్త కథను సిద్ధం చేస్తుపన్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్రం బృందం తొలుతగా కృతి శెట్టిని సంప్రదించగా. తను నో చెప్పినట్లు సినీ వర్గాల్లో టాక్‌. ఈ చిత్రంలో హీరోయిన్‌.. తల్లి పాత్ర పోషించాల్సి ఉండడంతోనే కృతి నో చెప్పినట్లు సమాచారం. కెరీర్‌ ప్రారంభంలోనే తల్లి క్యారెక్టర్స్‌ చేయననని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్యారెక్టర్‌ కోసం మహానటి కీర్తి సురేశ్‌ను సంప్రదించగా.. ఆమె ఓకే చెప్పిందట. 


కృతి శెట్టి నో చెప్పిన మదర్‌ పాత్రకు కీర్తి సురేష్ ఒకే చెప్పడం ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశమైంది. సాధారణంగా యువ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు.. చెల్లి, తల్లి పాత్రలు చేసేందుకు అంగీకరించరు. అయితే కీర్తి మాత్రం మంచి ప్రాజెక్ట్స్‌లను అసలు వదలుకోవడం లేదు. ఏలాంటి పాత్ర అయిన సరే.. మంచి, భిన్నమైన స్క్రిప్ట్‌ అయితే చాలు చేస్తానంటుంది కీర్తి. మహానటి సినిమాతో కీర్తి రేంజ్ ఒక్కసారిగా పెరిగిన విషయం తెలిసిందే.


ఇప్పటికే కీర్తి సురేష్ భిన్న పాత్రలు పోషించింది. పెద్దన్న సినిమాలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించిన కీర్తి.. భోళా శంకర్‌లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కూడా సోదరిగా కనిపించనుంది. ఇక గతేడాది కీర్తి నటించిన ‘పెంగ్విన్’ సినిమాలో కూడా ఒక బిడ్డకి తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారువారి పాట' సినిమాలో కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె చాలా అందంగా కనిపించనున్నారు.


Also Read: Ugadi 2022: ఉగాది నాడు ముస్లిం భక్తులతో కిటకిటలాడుతున్న వేంకటేశ్వరస్వామి ఆలయం.. ఎక్కడో తెలుసా


Also Read: Dark Net: నిఘాకు చిక్కకుండా.. డార్క్‌ నెట్‌లో దర్జాగా మత్తుపదార్థల క్రయవిక్రయాలు!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.