Keerthy Suresh Next Movie: నేను శైలజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. ఆ తరువాత మహానటి సినిమాతో నేషనల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. మహానటి సినిమా కీర్తి సురేష్ కెరీర్ లో మరపురాని సినిమాగా మిగిలింది. ఇక సౌత్ ఇండియాలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్…త్వరలోనే బాలీవుడ్ లోకి సైతం అడుగుపెట్టనుంది. వరుణ్ ధావన్ తో బేబీ జాన్ అనే సినిమా ద్వారా హిందీ ప్రేక్షకులను పలకరించనుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ చిత్రం కోసం కీర్తి సురేష్.. తీసుకుంటున్న రమ్యునరేషన్ ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు విషయానికి వస్తే ముందుగా బాలీవుడ్ లో ఆఫర్ రాగానే కీర్తి సురేష్ ఆలోచించిందట.. అంతేకాకుండా ఈ సినిమాలో.. హీరోయిన్ పాత్ర కొంచెం గ్లామరస్ గా కనిపించాల్సిన అవసరం ఉంది అని.. అలానే ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయని దర్శకుడు ముందే చెప్పారట. దాంతో కీర్తి సురేష్ ఈ సినిమా చేయాలా వద్దా అని చాలా రోజులు ఆలోచించిందట. ముందుగా నో చెప్పిన కానీ ఆ తర్వాత మాత్రం సినిమా వారు.. డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో.. కాదనలేకపోయిందని ఈ అమ్మాడి. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బేబీ జాన్ కోసం కీర్తి సురేష్ కీర్తి సురేష్ 6 నుంచి 8 కోట్ల దాకా పారితోషికం అందుకుందని తెలుస్తోంది. అందుకే ఈ హీరోయిన్ ఈ సినిమాలో  లిప్ లాక్ సీన్లో కూడా కనిపించనుందని.. అలానే గ్లామర్ రోల్ పోషించనుందని సమాచారం.


తెలుగు, తమిళం, మలయాళం లో ఇప్పటి వరకు కీర్తి సురేష్ కొంచెం పద్ధతిగానే కనిపిస్తూ వచ్చింది. బొల్డ్ సీన్స్ కి దూరంగా ఉంటూ కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆ ఒక్క సీన్ కోసం కీర్తి సురేష్ అంతటి రెమ్యునరేషన్ తీసుకోవడం చర్చలకు దారితీస్తోంది. అయితే ఈ వార్త నిజమా లేదా పుకారా అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలి అంటే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి