Good Luck Sakhi Release: ‘మహానటి’, ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’ సినిమాల తర్వాత కీర్తి సురేష్ నటించిన నాయికా ప్రాధాన్య చిత్రం ‘గుడ్‌ లక్‌ సఖి’ (Good Luck Sakhi Movie). స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి రైఫిల్‌ షూటర్‌గా నటించింది. నాగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. పరిస్థితులు చక్కబడటంతో ఈ సినిమాని నవంబరు 26న ప్రేక్షకులముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. వివిధ కారణాల వల్ల ఈ సినిమాని మరోసారి వాయిదా వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

“ముందుగా అనుకున్న తేదీన మరికొన్ని చిత్రాలు విడుదలవుతున్నాయి. థియేటర్ల సమస్య లేకుండా, అత్యధిక కేంద్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు డిసెంబర్ 10 (Good Luck Sakhi Release Date) అనువుగా ఉంది. అందుకే ఆరోజే ‘గుడ్‌లక్‌ సఖి’ మీ ముందుకొస్తుంది. మీ అందరినీ మెప్పిస్తుంది” అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. 



గన్ షూటింగ్ పోటీల నేపథ్య కథతో తీసిన ఈ చిత్రంలో కీర్తి సురేష్​ పక్కా పల్లెటూరి యువతిగా కనిపించనుంది. నగేష్ కూకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుధీర్​ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పిస్తున్నారు.


గతేడాది ఏప్రిల్​లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. అయితే జూన్​ 3న థియేటర్లలో విడుదల చేస్తామని మార్చిలో చిత్రబృందం ప్రకటించింది. కానీ, ఆ రోజున సినిమాను విడుదల చేసేందుకు వీలు కుదరలేదు. ఈ క్రమంలో సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ, నిర్మాతల అభీష్టం మేరకు సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని తెలిపారు. అదే నిర్ణయంతో ఇప్పుడు 'గుడ్​లక్ సఖి' సినిమాకు మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు.


అయితే కీర్తి సురేష్ నుంచి గతేడాది ఓటీటీలో రిలీజ్​ అయిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ చిత్రాలు (Keerthy Suresh New Movies).. ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపర్చాయి. అందుకే ‘గుడ్​లక్ సఖి’ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్.. ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా (Sarkaru Vaari Paata Release Date) విడుదల కానుంది. 


Also Read: Bheemla Nayak New Update: ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ బిజినెస్ షురూ.. రికార్డు ధరకు నైజాం రైట్స్?


Also Read: Akhanda Trailer: ‘'మీకు సమస్య వస్తే దండం పెడతారు..మేము ఆ సమస్యకే పిండం పెడతాం'..అదిరిన 'అఖండ' ట్రైలర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook