Allu Arjun: స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలోనూ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడి అభిమానులు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్‌ అని పిలుచుకుంటారు. ఆయన సినిమాలకు కేరళలో రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ సాధిస్తుంటాయి. బన్నీ కూడా కేరళ అభిమానులతో ఎప్పటికీ టచ్‌లోనే ఉంటాడు. తాజాగా అల్లు అర్జున్(Allu Arjun)కి ఓ కేరళ అభిమాని ఓ అరుదైన గిఫ్ట్ ని బహూకరించి..తన అభిమానాన్ని చాటుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే..
కేరళ(Kerala)లో పుట్టి దుబాయ్‌లో సెటిలైన మల్టీ మిలియనీర్‌ రియాజ్‌ కిల్టన్‌కి బన్నీ అంటే ఎనలేని అభిమానం. తన అభిమాన హీరోని ఒక్కసారైనా నేరుగా కలవాలనుకున్నాడు కిల్టన్‌. షూటింగ్‌ నిమిత్తం ఇటీవల యూఏఈ వెళ్లిన బన్నీని కిల్టన్‌ కలిశాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్​కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్(Ancient pistol)​ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్ మీడియా(Social Media) వేదికగా తెలియచేస్తూ వీడియోని షేర్‌ చేశాడు.


Also Read: Pushpa movie : పుష్పరాజ్‌ ప్రేయసి వచ్చేసింది..రష్మిక ఫస్ట్‏లుక్ అదిరిందిగా..


అల్లు అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘పుష్ప(Pushpa Movie) సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదటి పార్ట్ ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్​తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీలో రష్మిక మందన్నా(Rashmika Mandanna) లుక్‌ కూడా విడుదలైంది. ఇందులో రష్మిక  గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్(Fahad Fazil) విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook