KGF 2 Business: ప్రీ రిలీజ్ బిజినెస్‌లోనూ కేజీఎఫ్-2 రికార్డు- ఎన్ని కోట్లంటే..
KGF 2 Business: భారీ అంచనాల నడుమ ఈ నెల14న విడుదలవుతున్న కేజీఎఫ్-2 మూవీ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ చేసింది. అన్ని భాషల్లో కలిపి రూ.345 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం.
KGF 2 Business: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్-2. భారీ అంచనాల నడుమ ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ. కన్నడ స్టార్ హీరో యశ్ కథానాయకుడిగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ తీసిన ఈ మూవీ కన్నడలో నేరుగా విడుదల కానుంది. ఇక తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో డబ్బింగ్ వెర్షన్ విడుదలవుతోంది.
అయితే కేజీఎఫ్ ఛాప్టర్-1 సృష్టించిన సంచలనంతో.. పార్ట్-2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కన్నడ సహా ఇతర అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కళ్లు చెదిరేలా ఉన్నాయి.
ఎక్కడెక్కడ ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్?
కేజీఎఫ్-2 కన్నడలో రికార్డు స్థాయిలో రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ చేసినట్లు అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో రూ.78 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలిసింది.
తమిళనాడులో కేజీఎఫ్-2.. దలపతి విజయ్ సినిమా 'బీస్ట్'తో పోటీ పడుతోంది. విజయ్‌కి ఉన్న క్రేజ్ దృష్ట్య.. తక్కువ థియేటర్లలోనే కేజీఎఫ్-2 విడుదలవుతోంది. సుమారు 250 స్క్రీన్లలో మాత్రమే ఈ మూవీ అడనున్నట్లు సమాచారం. అయినప్పటికీ.. రూ.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలిసింది.
హిందీలో కేజీఎఫ్ రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట. సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న నేపథ్యంలో హిందీలో ఈ మూవీకి మరింత క్రేజ్ పెరిగింది.
మలయాళంలో కేజీఎఫ్-2 థియేట్రికలక్ రైట్స్ రూ.10 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఇక ఓవర్సిర్ రైట్స్ రికార్డు స్థాయిలో రూ.30 కోట్లకు అమ్ముడైనట్లు తెలిసింది.
మొత్తం అన్ని భాషల్లో, అన్ని సెంటర్లలో కలిపి రూ.345 కోట్ల బిజినెస్ చేసినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
నైజాం- 25 కోట్లు
సీడెడ్- రూ.14 కోట్లు
ఉత్తరాంద్ర- రూ.10 కోట్లు
ఆంధ్రావ్యాప్తంగా రూ.39 కోట్లు
Also read: Yash KGF 2: యశ్ 'కేజీఎఫ్ 2'కి తెలంగాణ సర్కార్ బంపరాఫర్... టికెట్ రేట్లు పెంచుతూ జీవో...
Also read: Alia Ranabir Wedding: త్వరగా పిల్లల్ని కనాలి... కాబోయే జంటపై సంజయ్ దత్ కామెంట్స్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook