KGF Chapter 2 Update: బాక్సాఫీసు వద్ద కన్నడ సూపర్‌స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 కలెక్షన్ల వర్షం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 మేనియా పట్టుకుంది. ప్రశాంత్ నీల్ సామర్ధ్యం, యశ్ నటనకు ఆ కలెక్షన్లే కొలమానంగా చెప్పుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూపర్‌స్టార్ యశ్ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 2 వరుసగా ఆరవ వారం కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా కన్పించడం లేదు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా రాకీ భాయ్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. యశ్ మేనియా ఇప్పుడు సర్వత్రా వ్యాపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లపై తాజా అప్‌డేట్ ఇది. 


కేజీఎఫ్ ఛాప్టర్ 2 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ 2తో రాకీభాయ్ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల కొరడా ఝులిపిస్తున్నాడు. ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ అందిస్తున్న వివరాల ప్రకారం..ఈ సినిమా తాజా కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటి వరకూ 1217 కోట్లు వసూలు చేసిందంటే మామూలు విషయం కానేకాదు. 


ఆరవ వారం కూడా కొనసాగుతున్న రాకీ భాయ్ క్రేజ్


కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదలై ఆరు వారాలవుతోంది. ఇప్పటివరకూ 1217 కోట్ల రూపాయలు వసూలైంది. ఈ సినిమా ఆరవ వారంలో తొలిరోజు 3.10 కోట్లు, రెండవరోజు 3.48 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్ మనోబాల విజయబాలన్ గణాంకాలు చెబుతున్నాయి.


ఆగని కేజీఎఫ్ ఛాప్టర్ 2 జోరు


ఏప్రిల్ 14న విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా..ఆ తరువాత విడుదలై బాలీవుడ్ ప్రముఖ హీరోల సినిమాల కంటే ముందుంది. కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదలైన తరువాత బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ నటించిన రన్‌వే 34, టైగర్ ష్రాఫ్ నటించిన హీరోపంతి 2, రణవీర్ సింహ్ నటించిన జయేశ్ భాయ్ జోర్‌దార్ సినిమాలున్నాయి. అయినా సరే..కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా బాక్సాఫీసు వద్ద మోత మోగిస్తూనే ఉంది. వసూళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది.


కేజీఎఫ్ ఛాప్టర్ 3 షూటింగ్ త్వరలోనే


కేజీఎఫ్ ఛాప్టర్ 2 కధను దర్శకుడు ప్రశాంత నీల్ స్వయంగా రాశారు. ఈ సినిమాలో యశ్‌తో పాటు సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాశ్ రాజ్ వంటి నటులున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్..సాలార్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత కేజీఎఫ్ ఛాప్టర్ 3 ప్రారంభం కానుంది. 


Also read: Bigg Boss Telugu OTT Winner: బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విజేత బిందు మాధవి... టైటిల్‌ను ఎవరికి అంకితం ఇచ్చిందంటే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.