KGF Chapter 2 worldwide Collections: ప్ర‌శాంత్ నీల్‌ డైరెక్ష‌న్‌లో కన్న‌డ స్టార్ హీరో య‌శ్‌ న‌టించిన పాన్ ఇండియా సినిమా 'కేజీఎఫ్ చాఫ్ట‌ర్ 2'. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 14న విడుదలై బాక్సాపీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై 42 రోజులు కావస్తున్నా.. బాక్సాఫీస్ వద్ద రాకీ భాయ్ జోరు ఆగడం లేదు. వివేషం ఏంటంటే.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైనా.. సినీ ప్రియులు థియేటర్‌లలో చూడటానికి ఇష్టపడుతున్నారు. దాంతో వసూళ్ల పరంగా కేజీఎఫ్ 2 ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఇప్పటివరకు రూ. 1229 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కేజీఎఫ్ 2 ఐదో వారం వరకు రూ.1210 కోట్లు వసూలు చేసిందని, ఆరో వారంలో రూ.17 కోట్లు రాబట్టిందని మనోబాల ట్వీట్ చేశారు. మొదటి వారం నుంచి 5వ వారం వరకు రూ. 1210.53 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఆరో వారంలో వరుసగా 3.10, 3.48, 4.02, 4.68, 1.87, 1.46 కోట్లు వసూల్ చేసింది. 


'కేజీఎఫ్ చాప్టర్ 2' ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. హిందీలో రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్ 2 తర్వాత అజయ్ దేవగన్ 'రన్‌వే 34', టైగర్ ష్రాఫ్ 'హీరోపంతి 2', రణవీర్ సింగ్ 'జయేష్‌భాయ్ జోర్దార్', కార్తీక్ ఆర్యన్ 'భూల్ భూలయ్యా 2' వంటి పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. అయితే అవేమి కేజీఎఫ్ 2 వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. 



'కేజీఎఫ్ చాప్టర్ 2' సినిమాలో రాకీ భాయ్ య‌శ్‌ సరసన శ్రీనిధి శెట్టి నటించారు. యష్‌తో పాటు సంజయ్ దత్ నట విశ్వరూపం ప్రదర్శించాడు. సంజయ్ దత్ విలన్ అధీర పాత్రలో నటించి ఔరా అనిపించాడు. రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి, ప్రకాష్ రాజ్ నటన సినిమాకు బాగా హెల్ప్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో చాప్టర్ 3 షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.


Also Read: RCB v LSG Eliminator: రికార్డు సృష్టించిన RCB v LSG మ్యాచ్.. CSK vs MI రికార్డు  బద్దలు!


Also Read: Dry Fruits Eating Tips: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి