Khushbu Sundar Strong Counter to her Trollers: ముంబైలోని ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన కుష్బూ బాలనటిగా తన సినీ రంగ ప్రస్థానం మొదలు పెట్టింది. తరువాత హీరోయిన్ గా మారింది. కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా మారిన ఆమె తర్వాత తన బేస్ మొత్తాన్ని చెన్నైకి మార్చేసి ముఖ్యంగా తమిళ సినిమాలు చేస్తూ వచ్చింది. శివాజీ గణేషన్ కుమారుడు ప్రభుతో కుష్బూ అనేక సినిమాల్లో నటించి ఇద్దరిదీ హాట్ పెయిర్ అనిపించేలా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సౌత్ లోనే 100 పైగా సినిమాల్లో నటించిన ఆమె అనేక మంది సూపర్ స్టార్ల పక్కన కనిపించింది. సినిమాల్లో కాస్త అవకాశాలు తగ్గుతున్నాయి అనుకున్న సమయంలో బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది. తరువాత రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసింది. 2010 సంవత్సరంలో డిఎంకె పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె నాలుగేళ్లు ఆ పార్టీలో కొనసాగి తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. కాంగ్రెస్లో ఆరేళ్లు కొనసాగి 2020 వ సంవత్సరంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంది.


బిజెపిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసింది. కానీ ఆమెకు లక్ అయితే కలిసి రాలేదు ప్రస్తుతానికి ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కి మెంబర్ గా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఆమె ఈ కమిషన్ లో సభ్యురాలుగా వ్యవహరిస్తోంది. రేఖ శర్మ ఆధ్వర్యంలో నడిచే ఈ నేషనల్ వుమెన్ కమిషన్ లో కుష్బూ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమె మరింత యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో తన మీద వస్తున్న ట్రోల్స్ గురించి స్పందిస్తోంది.


తాజాగా ఆమె చేసిన ఒక ఆసక్తికరమైన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేమిటంటే తన స్నేహితులు తనకు చెబుతూ ఉంటారని. మనం ఎదుగుతున్నప్పుడే ప్రజలు మనల్ని ట్రోల్ చేస్తూ ఉంటారని ఎందుకంటే మనం ఎదిగిన ఎత్తుకు వాళ్ళు ఎదగలేరని ఆమె చెప్పుకొచ్చింది. దాన్ని నమ్మకుండా ఉండలేకపోతున్నానని అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉండి బూతులు తిడుతూ ట్రోల్ చేస్తూ శాడిస్టిక్ ప్లెజర్ పొందుతున్న అందరూ త్వరలో కోలుకోవాలని ఆమె పేర్కొంది.
Also Read: Manchu Manoj Tributes: అత్తా మామలకు మంచు మనోజ్ నివాళులు..భార్యతో కలిసి భారీ కాన్వాయ్లో వెళ్లి!


Also Read: Venu Clarity on Copy Allegations: 'బలగం'పై కాపీ మరక.. డైరెక్టర్ వేణు ఏమంటున్నాడు అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి