Kiran Abbavaram - Rahasya Gorak Wedding: 2019 నవంబర్లో విడుదలైన రాజావారు రాణి గారు సినిమా షూటింగ్ సమయంలో.. మొదటిసారి కలుసుకున్న కిరణ్ అబ్బవరం,రహస్య గోరక్ ల మధ్య స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆ సినిమా సమయం నుంచే రహస్యంగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. ఈ ఏడాది మార్చ్ లో జరిగిన నిశ్చితార్థంతో.. తమ ప్రేమ వ్యవహారాన్ని అధికారికంగా బయటపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ జంట ఇవాళ పెళ్లి పీటలు ఎక్కారు. గత రెండు మూడు రోజుల నుంచి వీరి పెళ్లికి సంబంధించిన సంబరాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వచ్చాయి. సంగీత్ నుంచి మెహందీ వరకు ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 


ఇవాళ అంటే ఆగస్టు 22న ఈ జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో ప్రత్యక్షం అయింది. పెళ్లి బట్టల్లో నూతన వధూవరులుగా.. కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ లు పెళ్లి తంతులో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించిన చిన్న వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. రహస్య గోరక్ ఎంట్రీ, జీలకర్ర బెల్లం, కిరణ్ అబ్బవరం తాళి కడుతున్న వీడియో ఇలా కొన్ని వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.


 



అభిమానులందరూ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆశీర్వాదాలతో ఈ జంట ఒకటయ్యారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో పాలుపంచుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 


ఇక సినిమాలపరంగా చూస్తే.. కిరణ్ అబ్బవరం గతేడాది నటించిన మూడు సినిమాలలో ఒకటి మాత్రమే ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. ఇక ప్రస్తుతం కిరణ్ అబ్బవరం క అనే ఆసక్తికరమైన సినిమాతో బిజీగా ఉన్నారు. కిరణ్ అబ్బవరం కెరియర్ లో మొదటి ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.


Also Read : 1992 Ajmer Rape Cases : వంద మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..32 ఏండ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు


Also Read :  Gold Outlook: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే లక్ష దాటనున్న బంగారం ధర.. ఎప్పుడంటే ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook