Kiran Abbavaram Engagement: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహా బంధంలో అడుగుపెడుతున్నాడు. తన తొలి సినిమా 'రాజా వారు రాణి గారు' సినిమాలో తనతో నటించిన తొలి హీరోయిన్ రహస్యను ఆయన పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. కిరణ్ అబ్బవరం, రహస్య గత కొన్నేళ్లుగా ప్రేమ బంధంలో ఉన్నారు. అంతేకాదు రిలేషన్ షిప్‌లో ఉన్నారు.  ఈ వారమే ఇరు కుటుంబాలకు చెందిన పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్ధం (పూలు పండ్లు) వేడుక ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకను మీడియాకు దూరంగా సన్నిహితులు సమక్షంలో చేసుకోనున్నట్టు సమాచారం. కిరణ్ అబ్బవరం.. తన జీవితాన్ని ఎపుడు ప్రైవేట్‌గా ఉంచుకుంటున్నారు కిరణ్ అబ్బవరి. అంతేకాదు తన వ్యక్తిగత విషయాలను ఎపుడు గోప్యంగా ఉంచుతారు. ఈ నేపథ్యంలో కిరణ్ అబ్బవరం తన కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేటుగా ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగనుంది. ఇక ఎంగేజ్మెంట్, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో వెల్లడిచేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిరణ్ అబ్బవరం విషయానికొస్తే.. 'రాజా వారు రాణి గారు' సినిమాతో పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన దర్శకత్వంలో తెరకెక్కిన 'SR కళ్యాణ మండపం' సినిమాతో తొలి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత స్టెబాస్టియన్ PC 524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ సినిమాలతో పలకరించాడు. త్వరలో 'దిల్ రూబా' మూవీతో  పాటు 1970 దశకం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు.


Also read: Siddham Meeting: మీరు కృష్ణుడు.. నేను అర్జునుడిని.. కురుక్షేత్రానికి సిద్ధమా?: వైఎస్‌ జగన్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook