Kiran Abbavaram Love : కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరో లలో ఒకరు. 2019లో రాజావారు రాణి గారు అనే సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో ఒక మంచి హిట్ అందుకున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత పలు సినిమాలతో పాపులర్ అయిన కిరణ్ ఈ మధ్యనే మార్చ్ లో తన డెబ్యూ సినిమా లో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు. అసలు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అనే విషయం కూడా తెలియని అభిమానులు ఈ వార్త విని షాక్ అయ్యారు. ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉంచిన తన లవ్ స్టోరీని కిరణ్ ఈ మధ్యనే బయటపెట్టారు.


ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో వారి పరిచయం ఎలా మొదలైంది, తమ లవ్ స్టోరీ గురించి దాచారు అనే విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తమ ప్రేమ కథ గురించి చెబుతూ కిరణ్ అబ్బవరం "అయిదేళ్ల రిలేషన్ మాది. రాజావారు రాణిగారు సినిమా చేస్తున్నప్పుడే ఆ సినిమా సెట్స్ లోనే ఇద్దరం ఒకళ్ళ గురించి మరొకళ్ళు తెలుసుకున్నాం. అప్పుడే మా మధ్య మంచి స్నేహం కుదిరింది. తర్వాత ఒకరికొకరు నచ్చాము. నా ఆలోచనలు తనకి, తన ఆలోచనలు నాకు బాగా నచ్చాయి," అన్నారు.


"మా మధ్య ప్రేమ మొదలైంది కాని ఇద్దరం సంవత్సరంన్నర వరకు అసలు ప్రపోజ్ చేసుకోలేదు. ఆ తర్వాతే ఐ లవ్ యు చెప్పుకున్నాము" అని వివరించారు కిరణ్ అబ్బవరం. "నా పర్సనల్ లైఫ్ గురించి బయటకి చెప్పడం నాకు నచ్చదు. నా ఫ్యామిలీ గురించి కూడా అందుకే ఎవరికీ ఎక్కువగా తెలీదు. మా రిలేషన్ షిప్ ని కూడా అలాగే మెయింటైన్ చేశాను. నిశ్చితార్థం కూడా అలాగే సీక్రెట్ గానే చేసుకోవాలనుకున్నాం కాని కుదరలేదు" అని అన్నారు కిరణ్ అబ్బవరం. 


ఇక సినిమాల పరంగా చూస్తే, కిరణ్ అబ్బవరం చివరగా నేహా శెట్టి హీరోయిన్ గా రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. ప్రస్తుతం కిరణ్ చేతిలో మరో మూడు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాల గురించిన వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరి ఈ సినిమా లతో కిరణ్ ఎంతవరకు హిట్స్ అందుకుంటాడో వేచి చూడాలి.


Also Read: తెలుగు నేలతో బాబా సాహెబ్ అంబేద్కర్ అనుబంధం..


Also Read: ఖమ్మం పాలిటిక్స్ లో కీలక పరిణామం.. భట్టి, తుమ్మల ఏకమై.. పొంగులేటికి చెక్..?



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter