Kiran Abbavaram: ఇక మిమ్మల్ని నా భర్తగా పిలుస్తా.. హీరో పెళ్లి డేట్ బయటపెట్టిన హీరోయిన్..
Kiran Abbavaram Wedding Date: కిరణ్ అబ్బవరం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. ఈమధ్య వరస పెట్టి.. సినిమాలు తీసిన హీరో ఎవరు అంటే.. ముందుగా గుర్తొచ్చే పేరు కిరణ్ అబ్బవరం. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ హీరో పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త తెగ వైరల్ అవుతుంది..
Kiran Abbavaram Wedding; రాజు వారు.. రాణి వారు.. సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత నుంచి వరుస సినిమాలు చేస్తూ.. తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. క అనే సినిమా టీజర్ కూడా విడుదలయ్యింది. ఈమధ్య వరుస ఫ్లాపులు అందుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ సినిమాతో మరోసారి విజయం సాధించాలని.. ఈ చిత్ర కథను వైవిద్యంగా ఎంచుకున్నట్లు.. ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ క్రమంలో.. ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా ఒక వార్త.. ఈరోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ మధ్యనే కిరణ్ కి.. తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ తో.. ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు కిరణ్ పుట్టినరోజు సందర్భంగా.. రహస్య గోరక్ వేసిన పోస్ట్.. ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నీ బయటపెట్టింది. ఈ హీరోయిన్ పెట్టిన పోస్టులను బట్టి చూస్తే.. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్ చేసినట్టుగా కనిపిస్తోంది.
‘హ్యాపీ బర్త్డే కిరణ్.. ఇంకో 38 రోజుల్లో నా భర్తగా మిమ్మల్ని పిలుస్తాను..’ అంటూ పెళ్లి డేట్ గురించి హింట్ ఇచ్చింది ఈ హీరోయిన్. అంటే ఇంకో 38 రోజుల్లో వీరి పెళ్లి జరగబోతోందన్న మాట. అంటే ఆగస్ట్ నెలలో వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా.. ఈ పోస్ట్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇక ప్రస్తుతం రహస్య షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక ఈ వీడియోలో.. వీరిద్దరి ఫోటోలు.. కలిసి తిరిగిన చిన్న చిన్న వీడియోస్.. అన్ని కలగలిపి ఉన్నాయి. ఈ వీడియోని చూసి.. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు..
ఇక కిరణ్ అబ్బవరం క సినిమా విషయానికి వస్తే.. ఈ క చిత్రంలో కిరణ్ అబ్బవరం పోస్ట్ మ్యాన్ పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ అయితే అందరినీ ఆకట్టుకునేలా ఉంది. విజువల్, ఆర్ఆర్ పరంగా టాప్ నాచ్‌లో కనిపిస్తోంది. మరి ఈ చిత్రం ఈ హీరోకి ఎలాంటి విజయం.. అందిస్తుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి