Free OTT: నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ భారంగా ఉందా..అయితే ఇది మీ కోసమే. ఉచిత ఓటీటీ వేదికలు కూడా ఉన్నాయి. ఇందులో ఉచితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఇండియాలో ఓటీటీ క్రేజ్ విపరీతంగా పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు కూడా నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయంటే..క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీ లివ్, డిస్నీ హాట్‌స్టార్ ప్లస్ వంటి పెయిడ్ ఓటీటీలున్నాయి. ఇందులో సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. ఇది సామాన్యుడికి భారంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఓటీటీ యాప్‌ల గురించి తెలుసుకుందాం..వీటిలో ఉచితంగా లేటెస్ట్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు. అయితే ఈ ఉచిత యాప్స్‌లో మద్యమధ్యలో యాడ్స్ ఎక్కువగా వస్తుంటాయి.


MX Player


ఎంఎక్స్ ప్లేయర్ చాలా కాలం క్రితం ఆఫ్ లైన్ వీడియో ప్లేయర్‌గా ప్రారంభమైంది. నెమ్మదిగా ఇది ఓటీటీగా మారింది. ఇది పూర్తిగా ఉచితం. దీనికోసం ఏ విధమైన సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. మొత్తం 12 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో వెబ్‌సిరీస్, సినిమాలు లేటెస్ట్ అందుబాటులో ఉంటాయి.


Jio Cinema


జియో సినిమా కూడా ఉచిత ఓటీటీ వేదిక. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియో యూజర్లకు ఇది పూర్తిగా ఉచితం. ఇందులో చాలా భాషల్లో సినిమాలు ఉంటాయి. 


Voot


ఉచితంగా వెబ్‌సిరీస్, సీరియల్స్, సినిమాలు చూడాలంటే సరైన వేదిక వూట్. దీనిని యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఉచితం. నెట్‌వర్క్ 18 కు సంబంధించి ఛానెల్స్ కూడా చూడవచ్చు.


Tubi


హాలీవుడ్ సినిమాలంటే ఆసక్తి చూపించేవారికి టూబి ఓటీటీ ఉపయోగంగా ఉంటుంది. ఇందులో చాలా రకాల హాలీవుడ్ సినిమాలున్నాయి. అయితే మధ్యమధ్యలో యాడ్స్ గందరగోళం ఎక్కువ ఉంటుంది.


Plex


ఇక మరో ఉచిత ఓటీటీ వేదిక ప్లెక్స్. ఇందులో కూడా ఉచితంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడవచ్చు. ఈ ఓటీటీ యాప్‌లో మీరు 2 వందల కంటే అధికంగా లైవ్ ఛానెల్స్ ఉచితంగా చూడవచ్చు. ఇందులో హిందీ కార్యక్రమాలు కూడా ఉన్నాయి.


Also read; Mrunal Thakur Pics: జిమ్‌లో మృణాల్‌ ఠాకూర్‌.. హాట్ అందాలు చూడతరమా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి