Varalaxmi sarathkumar: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కువగా విన్పిస్తున్న పేరు వరలక్ష్మీ శరత్ కుమార్. పవర్‌ఫుల్ పాత్రలతో కోలీవుడ్ కంటే టాలీవుడ్‌లో క్రేజ్ పెంచుకుంది. ఆ క్రేజ్‌తోనే భారీగా ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు , తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ ( Sarath kumar) పెద్ద కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్. ఇటీవలి కాలంలో ఎక్కువగా విన్పిస్తున్న పేరు. తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఇటీవల తెలుగులో వరలక్ష్మీ శరత్ కుమార్ చేసిన క్రాక్, నాంది సినిమాలు హిట్ అవడంలో వరలక్ష్మీ శరత్ కుమార్( Varalaxmi sarathkumar) పాత్ర కీలకమని చెప్పకతప్పదు. అందుకే తెలుగులో ఆమెకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ క్రేజ్ ఇప్పుడీ భామకు భారీగా ఆఫర్లు తెచ్చిపెట్టింది.


వరలక్ష్మీ శరత్ కుమార్‌కు హీరోయిన్‌గా అంత గుర్తింపు రాలేదు. విజయ్ హీరోగా వచ్చి సర్కార్ సినిమా ( Sarkar movie) లో ఆమె చేసిన నెగెటివ్ రోల్‌కు డిమాండ్ పెరిగింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్‌కు  గట్టి పోటీ ఇచ్చింది వరలక్ష్మి. పవర్‌ఫుల్ ఐరన్ లేడీగా ప్రత్యేకమేన గుర్తింపు పొందింది. అంతకంటే ముందు అంటే 16 ఏళ్ల వయస్సులోనే అవకాశాలొచ్చినా నటించలేదు. ముఖ్యంగా శంకర్ తీసిన బాయ్స్ సినిమాలో జెనీలియా కంటే ముందు వరలక్ష్మిని ఎంపికే చేస్తే..ఎడ్యుకేషన్ కారణంగా వద్దనుకున్నారు. రవితేజకు చాలాకాలం తరువాత హిట్ కొట్టిన క్రాక్ సినిమా ( krack movie) లో జయమ్మ అనే మాస్ పాత్రలో రాణించింది. అటు హిట్ కోసం సుదీర్ఘకాలం నిరీక్షించిన అల్లరి నరేష్ నాంది సినిమా ( Naandi movie) లో ముఖ్యమైన లాయర్ పాత్రలో నటించి మెప్పించింది. దాంతో ఇప్పుడు తెలుగు పరిశ్రమలో పవర్ ఫుల్ లేడీ పాత్రలకు వరలక్ష్మి అయితే బెటర్ అనేది దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే ఆమె డేట్స్ కోసం వెంటపడుతున్నారు. అల్లు అర్జున్-కొరటాల శివ ( Allu Arjun - Koratala siva )కాంబినేషన్‌లో వస్తున్న పొలిటికల్ సినిమాలో వరలక్ష్మి ఓ రాజకీయ నాయకురాలిగా కన్పించనుంది. మరోవైపు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న అఖిల్ కొత్త సినిమాలో కూడా పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్  చేస్తోంది. మొత్తానికి తెలుగులో ఆఫర్లు బాగానే వస్తున్నాయి. 


Also read: Check movie collections: చెక్ మూవీ Box office result చెక్ చేశారా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook