Indian 2 Movie updates: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ భారతీయుడు-2. కొవిడ్, బడ్జెట్, కొన్ని ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగార్వల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ మూవీలో భాగమైన తమిళ నటుడు వివేక్, మలయాళ నటుడు నెడుముడి వేణు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అయితే వీరిద్దరికి సంబంధించిన షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో మూవీ యూనిట్ కు పెద్ద సమస్య వచ్చిపడింది. రీషూట్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవ్వడంతోపాటు సమయం కూడా వృథా అవుతుంది. అందుకనే డైరెక్టర్ శంకర్ ఓ సూపర్ టెక్నాలజీని వాడి వారి ముఖ చిత్రాలను సీజీఐ ద్వారా తెరపె చూపించనున్నారు. ఇలాంటి టెక్నాలజీలోని ఎక్కువగా హాలీవుడ్ లో వాడతారు. కానీ భారతీయుడు-2 కోసం శంకర్ ఈ సాంకేతికతను వాడటం ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ మారింది. 


Also Read: Vijay Deverakonda Emotional Speech: బేబీ నన్ను బాగా డిస్టర్బ్ చేసింది : విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్


తమిళ నటుడు వివేక్ షూటింగ్ మెుదలైన కొన్ని రోజులకే గుండెపోటు మరణించారు. అలాగే మలయాళ నటుడు నెడుముడి వేణు కరోనా బారిన పడి మృతి చెందారు. మళ్లీ వీరిద్దరి పాత్రలను తెరపై టెక్నాలజీ వాడి చూపిస్తుండటంతో వీరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read: Project K Update: హాలీవుడ్ రేంజ్‌లో 'దీపికా' ఫస్ట్ లుక్... అంచనాలు పెంచేసిన 'ప్రాజెక్టు-కె'..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook